వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎన్నికలు: బిర్యానీ ధరలు తగ్గించాలన్న ఈసీ, తగ్గింపు ధరలివే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : తగ్గిన బిర్యానీ ధరలు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా? అని పసందైన బిర్యానీ ధరలు తగ్గుతున్నాయి. తెలంగాణలో బిర్యానీ ధరలు తగ్గించాలని ఏకంగా ఎన్నికల సంఘమే కోరడం గమనార్హం. అయితే, ఈ తగ్గింపు మాత్రం సామాన్య ప్రజలకు కాదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు తగ్గించేందుకే ఈసీ ఈ మేరకు సూచన చేసింది.

హోటళ్లలో భోజనం చేస్తే మాత్రం..

హోటళ్లలో భోజనం చేస్తే మాత్రం..

అయితే, తగ్గిన బిర్యానీ ధరలు హోటళ్లలో భోజనం చేసే వారికి మాత్రం వర్తించవు. ఎన్నికల సమయంలో ఎవరైతే తమ పార్టీ కార్యకర్తల కోసం భారీ ఎత్తున ఆర్డర్లు చేస్తారో వాటికే మాత్రమే వర్తిస్తాయి.

ఈసీ ప్రతిపాదన..

ఈసీ ప్రతిపాదన..

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఈ ప్రతిపాదనను రాజకీయ పార్టీల కోసం చేశారు. ఈ ప్రతిపాదనలు అమలైతే బిర్యానీ ధరలు బరిలో నిలవనున్న అభ్యర్థులకు తక్కువ ధరకేబిర్యానీ దొరకనుంది.

తగ్గింపు ఎంతంటే..?

తగ్గింపు ఎంతంటే..?

మటన్ బిర్యానీ ధర రూ. 170 ఉండగా, ఇక 140కే లభించనుంది. ఇక చికెన్ బిర్యానీ కూడా 140కి బదులుగా 120కే లభించనుంది. దీంతో అభ్యర్థుల ఖర్చు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

 పరిగణలోకి ఆహార ఖర్చులు కూడా..

పరిగణలోకి ఆహార ఖర్చులు కూడా..

అభ్యర్థుల ఎన్నికల ఖర్చును తగ్గించేందుకే ఈ ప్రతిపాదనను ఎన్నికల సంఘం ముందుకు తెచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఆహారం ఖర్చులు కూడా ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది.

English summary
If you are in Telangana, then it is a good time for some biriyani. The Election Commission has suggested bringing down the prices of biriyani in a bid to bring down poll expenditure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X