వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలక్‌పేట్, జహీరాబాద్ అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్, 'టీఆర్ఎస్‌లో అసంతృప్తి క్లోజ్ '

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మరో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేశారు. గత నెల 6వ తేదీన 119 నియోజకవర్గాలకు గాను 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మల్కాజిగిరి, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

119కి 107 మంది అభ్యర్థుల ప్రకటన

119కి 107 మంది అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా మాణిక్ రావు, మలక్‌పేట అభ్యర్థిగా చావ సతీష్ కుమార్ పేర్లను ఆదివారం రాత్రి ఖరారు చేశారు. దీంతో అభ్యర్థులను ప్రకటించిన సంఖ్య 107కు చేరింది. మరో పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రకటించవలసి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో వీటిని కూడా ప్రకటించవచ్చు.

ఆరోసారి: సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలిస్తే జాతీయ రికార్డ్, కీలక నేతల రికార్డులు ఇవీఆరోసారి: సిద్దిపేట నుంచి హరీష్ రావు గెలిస్తే జాతీయ రికార్డ్, కీలక నేతల రికార్డులు ఇవీ

మాణిక్ రావు జహీరాబాద్ నుంచి

మాణిక్ రావు జహీరాబాద్ నుంచి


మాణిక్ రావు గత ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మలక్‌పేటలోను సతీష్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. తద్వారా గతంలో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం కల్పించారు. మాణిక్ రావు రవాణా శాఖలో ఆర్డీవోగా పని చేసి పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత తెరాసలో చేరారు. 2014లో ఈయన కాంగ్రెస్ నేత గీతా రెడ్డిపై కేవలం 842 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సతీష్ కుమార్ మలక్‌పేట నుంచి

సతీష్ కుమార్ మలక్‌పేట నుంచి

సతీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి 1997 వీఆర్ఎస్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో టీడీపీలో చేరారు. 2010లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో ఆ పార్టీ తరఫున మలకపేట నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా, మధ్యంతర ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇంచార్జిగా, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పల్లెబాట ఇంచార్జిగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఇంచార్జిగా పని చేశారు.

అసమ్మతి సద్దుమణిగింది

అసమ్మతి సద్దుమణిగింది

సర్వే ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి వేరుగా అన్నారు. తెలంగాణ భవన్లో తెరాస భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని కేసీఆర్ ధీమాగా ఉన్నారని చెప్పారు. ప్రతి అభ్యర్థి బ్యాక్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఒక ట్రెండ్ సెట్ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను కోరామని చెప్పారు. తమ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో ముందుకు సాగుతున్నారని, మేం అధికారంలోకి రావాల్సిన అవసరం ప్రజలకు వివరిస్తామన్నారు. 100కు పైగా స్థానాల్లో గెలుస్తామన్నారు. అసమ్మతి సద్దుమణిగిందని, కొద్దిగా ఉన్నా అది సర్దుకుంటుందని చెప్పారు.

English summary
The TRS on Sunday announced the names of its candidates for two more constituencies out of the 14 that it had left out. On September 6, TRS party president had announced the names of candidates for 105 out of 119 seats. TRS president K Chandrasekhar Rao announced the names of candidates for Zaheerabad and Malakpet assembly constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X