వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కా వాస్తుతో పాటు....అన్ని హాంగులతో కొత్త సచివాలయ నిర్మాణం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వాస్తు దోషం ఉందనే కారణంగానే తెలంాణ సచివాలయాన్ని కూల్చివేయాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. సచివాలయం నిర్మాణం వాస్తు ప్రకారంగా నిర్మించని కారణంగా అనేక దుష్పలితాలు సంభవించాయని కెసిఆర్ విశ్వసిస్తున్నారు.వాస్తు దోషం లేకుండా అన్ని హాంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమౌతోంది.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఉన్న ఆవరణలోనే ఎపి సచివాలయానికి కూడ భవనాలను కేటాయించారు. అమరావతి నుండే ఎపి పాలన సాగుతోంది.దీంతో ఈ భవనాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.ఈ విషయమై ఎపి ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించింది.ఈ భవనాలను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది.

తెలంగాణ సచివాలయం వాస్తు ప్రకారంగా లేదని సిఎం కెసిఆర్ విశ్వసిస్తున్నారు. ఇప్పటికే వాస్తు ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు సచివాలయంలో చేశారు. సిఎం కెసిఆర్ కు వాస్తు సలహాదారు సుద్దాల సుదాకర్ తేజ సూచనల ప్రకారంగా మార్పులు చేర్పలు చేశారు. ఏడాది క్రితం వరకు సచివాలయంలోని పెట్రోల్ బంక్ పరక్క నుండి ఉద్యోగులు వచ్చేంుకు ఉన్న గేటును మూసివేశారు. ఈ గేటు ఓపెన్ చేయడం సరి కాదని వాస్తు నిపుణులు సూచించారు. మరో వైపు సి బ్లాక్ సమీపంలో ఉన్న మీడియో లాంజ్ వాస్తు ప్రకారంగా లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

telangana excisting secretariat built witout proper vaastu

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు గవర్నర్ సిఎం గా ఉన్న కాలంలో ఈ మీడియా లాంజ్ చుట్టూ చిన్న కందకం తవ్వి అందులో నీరు ఉండేలా చర్యలు తీసుకొన్నారు.కొంత కాలం వరకు దీన్ని అమలు చేశారు.కాని...దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు.తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్ళలో సచివాలయం నుండే కొంతకాలంపాటు సిఎం కెసిఆర్ సమీక్షలు నిర్వహించేవారు. వాస్తు కారణాలతో పాటు ఇతరత్రా కారణాలతో సచివాలయానికి రావడం కెసిఆర్ తగ్గించారు.

వాస్తు ప్రకారంగా సచివాలయంలో కొన్ని మార్పులు చేశారు. సిఎం చాంబర్ కు వెళ్ళేందుకు వీలుగా పోచమ్మ గుడి సమీపంలో రోడ్డులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సి బ్లాక్ వాహానాలు వచ్చే దారిని వాస్తు ప్రకారంగా తాత్కాలిక మార్పులు చేశారు.స.భయంకరమైన వాస్తు లోపాలున్నందునే ఈ సచివాలయం నుండి పాలన సాగించిన వారికి కష్టాలు వచ్చాయని వాస్తు నిపుణులు చెప్పారని సమాచారం.దీంతో వాస్తు కు అనుగుణంగా సచివాలయాన్ని నిర్మించాలని సిఎం తలపెట్టారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు సిఎం లుగా పనిచేసిన సిఎం లు వాస్తు సక్రమంగా లేని కారణంగానే ఇబ్బందులు పడిన విషయాన్ని కెసిఆర్ చెబుతున్నారు..మంత్రివర్గ సమావేశంలో కూడ ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కారణాలన్నింటితో పాటుగా మంత్రులు....వారి ప్రిన్సిఫల్ సెక్రటరీలు...హెచ్ ఓ డి కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రయోజనమనే మరో కారణం కూడ కొత్త సచివాలయ నిర్మాణానికి కారణంగా కన్పిస్తుంది.

English summary
Telangana govt decided to new secretariat with vaastu. existing secretariat built without proper vaastu.so many cm s faces lot of problems in their term.so kcr decided to new secretariat with vaastu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X