• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్ర‌త్యేక హోదా మాకు బీ కావాలె...! లేక‌పోతే హోదాలేదు.. గీదా లేదు..!!

|

ప్ర‌త్యేక హోదా అంశం మ‌రో తెలంగాణ ఉద్య‌మం కాబోతోందా..? ఆంద్ర ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా ఇస్తే తెలంగాణ‌కు కూడా ఇచ్చి తీరాలా..? ప్ర‌త్యేక హోదా అంశానికి తెలంగాణ అడ్డుత‌గులుతోందా.. ? ప్ర‌త్యేక హోదా అంశంలో ఎంలాంటి సౌక‌ర్యాలు పొందుప‌రుస్తారో ముందుగా తెలంగాణ రాష్ట్రానికి వివ‌రించాలా..? కేంద్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నుకుంటే అందుకు తెలంగాణ స‌మ్మ‌తి కావాల్సిందేనా.. ? అంటే అవున‌నే స‌మాదానాలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా ముదిరి పాకాన ప‌డిన ప్ర‌త్యేక హోదా అంశానికి తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది.

ప్ర‌త్యేక హోదా ప‌ట్ల తెలంగాణ కొత్త రాగం.. ఇస్తే ఒప్పుకోం అంటున్న నాయ‌కులు..

ప్ర‌త్యేక హోదా ప‌ట్ల తెలంగాణ కొత్త రాగం.. ఇస్తే ఒప్పుకోం అంటున్న నాయ‌కులు..

రాష్టం రెడుగా విడిపోయిన తర్వాత ఆంద్ర ప్ర‌దేశ్ శాప‌గ్ర‌స్థంగా త‌యార‌య్యింది. ఒక ప‌క్క లోటు బ‌డ్జెట్, సున్నా నుంచి అభివ్రుద్ది చేయ‌డం, మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, ఉద్యోగ క‌ల్ప‌న‌, ప్ర‌తిప‌క్షంతో పాట్లు, కేంద్రంతో స‌మ్మెట పోట్లు, కేంద్రం ఇస్తున్న అడ‌పాద‌డ‌పా చేయూత ప‌ట్ల ప‌క్క రాష్ట్రాల కొర్రీలు... ఇవ‌న్నీ అదిగ‌మించి రాష్ట్రాన్ని ముందుకు న‌డింపించ‌డం ఎవ‌రి త‌రం అవుతుంది..? ఉన్న ఆదాయ వ‌న‌రుల‌ను కాపాడుకుంటూ రాష్ట్రాన్ని అభివ్రుద్ది ప‌ధంలో న‌డిపించేందుకు చంద్ర‌బాబు లాంటి అనుభ‌వ‌శాలి ఉన్నా త‌న ఒక్క‌డితో స‌రిపోయేది కాదు. దానికి ఇత‌ర రాష్ట్రాల‌, ఇత‌ర ముఖ్య‌మంత్రుల, కేంద్ర పెద్ద‌ల, విదేశీ ప్ర‌తినిధుల స‌హ‌కారం ఎంతో అవ‌స‌రం. అన్నీ సాదించినా ప‌క్క రాష్ట్రానికి న‌చ్చ‌క‌పోతే క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తుంది. ఏపి ప్ర‌స్తుత పురోగ‌మ‌నం అచ్చు అలాగే ఉంది. చంద్ర బాబు ఒకడుగు వేద్దాం అనుకునే లోపే వైరి ప‌క్షానివి ప‌ది అడుగులు ముందుకు ప‌డుతున్నాయి. ఇక న‌డ‌క ఎలా సాగాలి అనే దానిపై ఉంత్కంఠ నెల‌కొంది.

 ప్ర‌త్యేక హోదా పై అన్నీ అవ‌రోదాలే.. మాకూ కావాలంటున్న అంటున్న తెలంగాణ నేత‌లు..

ప్ర‌త్యేక హోదా పై అన్నీ అవ‌రోదాలే.. మాకూ కావాలంటున్న అంటున్న తెలంగాణ నేత‌లు..

లోటు బ‌డ్జెట్ లో ఉన్న ఆంద్ర ప్ర‌దేశ్ రాష్ట్రం ఆర్థికంగా కోలుకునే వ‌ర‌కు కేంద్రం సాయం చేయాల‌న్న చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తుల‌ను బీజెపి ప్ర‌భుత్వం బుట్ట‌దాఖ‌లు చేసింది. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌ను సైతం నామ‌మాత్రంగా అమ‌లు చేస్తూ కాలం నెట్టుకొస్తోంది కేంద్రం. విభ‌జ‌న స‌మ‌యంలొ ఆంద్ర ప్ర‌దేష్ కు ఎలాంటి సాయం కావాలో అదికారంలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఒక‌టికి వంద సార్లు బ‌ల్ల గుద్ది మ‌రీ గుర్తు చేసారు బీజేపి నాయ‌కులు. త‌ర్వాత అదికారంలోకి వ‌చ్చాక ఏపి మౌళిక స‌దుపాయాల కోసం గొంతుచించుకుని అర‌చిన నేత‌లు చ‌ల్ల‌బ‌డిపోయారు. విభ‌జ‌న హామీల ప‌ట్ల క‌నీసం నోరు మెద‌ప‌డం లేదు. అవిభాజ్య ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే స‌రైన న్య‌యం జ‌రుగుతుంద‌ని ఓ మోస్త‌రు యుద్దం చేసిని నాయ‌కులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదికార మార్పు జ‌రిగిన‌ప్పుడు పెద్ద‌న్న‌లా ఆదుకోవాల్సిందిపోయి ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం ఏపి ప్ర‌జ‌లు జీర్నించుకోలేక పోతున్నారు.

నాలుగేళ్లుగా సైలెన్స్... ఉన్న‌ట్టుండి బాంబ్ పేల్చిన తెలంగాణ‌.

నాలుగేళ్లుగా సైలెన్స్... ఉన్న‌ట్టుండి బాంబ్ పేల్చిన తెలంగాణ‌.

నాలుగు సంవ‌త్స‌రాలు కేంద్రంతో మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌న‌ప్ప‌టికి ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేద‌ని ఏపి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది. ఇవ్వాల్సిన నిధుల‌ను స‌క్ర‌మంగా విడుద‌ల చేయ‌కుండా, బ‌డ్జెట్ స‌రైన కేటాయింపులు చేయ‌కుండా రాష్ట్రం ప‌ట్ల క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని తెలుగుదేశం ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తోంది. విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చ‌డంతో పాటు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ను చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వం పై ఒత్తిడి తెచ్చారు. మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించ‌ని బీజెపి ప్ర‌భుత్వం నుండి బ‌య‌ట‌కు కూడా వ‌చ్చ‌రు. ఇక చివ‌ర‌గా ఆంద్ర ప్ర‌దేశ్ స‌త్వ‌ర అభివ్రుద్ది కోసం అమలు చేస్తాన‌న్న ప్ర‌త్యేక హోదాను వెంట‌నే అమ‌లు చేయాల‌ని పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానం కూడా ప్ర‌వేశ పెట్టారు. ప్ర‌త్యేక హోదా ఆంద్ర‌ప్ర‌దేశ్ కి కేంద్రం ఇచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసినా, ఇవ్వాల‌నుకున్నా స‌రికొత్త స‌వాల్ ను ఎదుర్కొనే ప‌రిస్థ‌తులు త‌లెత్తాయి. ఆంద్ర ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా ఇస్తే తెలంగాణ‌కు కూడా ఇవ్వాల్సిందేన‌ని పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ఒక‌వేల ఇవ్వ‌క‌పోతే తెలంగాణ నుండి ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఆంద్రాకు త‌ర‌లివెళ్లే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని భ‌విశ్య‌త్తులో జ‌ర‌గ‌బోయే న‌ష్టాన్ని అంచానా వేసి వివ‌రిస్తోంది తెలంగాణ‌.

ఎన్నిక‌ల కోస‌మే కొత్త ఎత్తుగ‌డ‌గా అంటున్న ఏపి.. తెలంగాణ ప్ర‌జ‌లు విజ్ఞుల‌ని కితాబు..

ఎన్నిక‌ల కోస‌మే కొత్త ఎత్తుగ‌డ‌గా అంటున్న ఏపి.. తెలంగాణ ప్ర‌జ‌లు విజ్ఞుల‌ని కితాబు..

ప్ర‌త్యేక హోదా ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్ల‌గా నోరు మెద‌ప‌లేదు. ఆంద్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా త‌మ‌కు సంబంధం లేని అంశంగా ప‌రిగ‌ణించారు. ప్ర‌త్యేక హోదా డిమాండ్ తారా స్థాయికి వెళ్లిన ప్ర‌స్తుత త‌రుణంలో హోదా ప‌ట్ల తెలంగాణ వ్య‌క్తం చేస్తున్న సందేహాల‌ ప‌ట్ల టీడిపి నేత‌లు అవాక్క‌వుతున్నారు. ప్ర‌త్యేక హోదా లో ఎలాంటి అంశాలు పొందుప‌రుస్తారో ముందుగా తెలంగాణ ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సిందేన‌ని టీఆర్ఎస్ ఎంపి వినోద్ పార్ల‌మెంట్ లో స్పీక‌ర్ ను డిమాండ్ చేసారు. లేని ప‌క్షంలో ప్ర‌త్యేక హోదాను తెలంగాణ ప్ర‌భుత్వం అంగీక‌రించేది లేద‌నే సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా మంత్రి హ‌రీష్ రావు సైతం ఆంద్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇస్తే సంహించేది లేద‌ని హెచ్చ‌,రిక‌లు జారీ చేసారు. అంటే తెలంగాణ స‌మ్మ‌తి లేనిదే ఆంద్ర ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా క‌ల సాకారం కాద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌రో సారి రెచ్చ‌గొట్టేందుకు తెలంగాణ నాయ‌కులు పావులు క‌దుపుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హోదా పైన అంత ద్రుష్టి కేంద్రీక‌రిస్తారా అన్న‌దే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

English summary
telangana government bringing new demand before central government. if special status grants for ap should implement for telangana too. telangana arguing that if ap granted special status the industries will migrate to ap from telangana. than telangana income will be downfall. so telangana demanding special shouldn't grants for ap
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X