వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్నోవేషన్స్ లో తెలంగాణ దూకుడు.. స్పాట్ ఫెర్టిలైజర్ అప్లికేటర్ ను కనిపెట్టిన జగిత్యాల రైతు

|
Google Oneindia TeluguNews

''జీవితాలను మర్చేసే ఐడియా కోసం జీవితాతం ఎదురుచూసే రోజులు పోయాయి. సరైన వేదిక, తగిన గుర్తింపు ఉండాలేగానీ మాలోనూ ఎంతో మంది ఆవిష్కర్తలున్నారు'' అని నిరూపిస్తున్నారు తెలంగాణ రైతులు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ గా ఉన్న తెలంగాణ ఇవాళ ఇన్నోవేషన్ కు ఇంటి అడ్రెస్ గా మారింది. దాదాపు ప్రతి గ్రామంలో రైతులు, యువకులు చిన్ని చిన్న ఆవిష్కరణేలేవో కనిపెడుతూనే ఉన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్నది.

తక్కువ ఖర్చుతో ఎరువుల యంత్రం
చేత్తోగానీ యంత్రంతోగానీ పొలం మొత్తం ఎరువు చల్లడం వల్ల వేస్టేజితోపాటు శ్రమ కూడా వేస్టవుతుంది. దీన్ని నివారించేందుకు జగిత్యాల జిల్లాకు చెందిన యువరైతు చింతకింద జలేనదార్ కొత్త ఐడియాను కనిపెట్టాడు. మొక్క మొదళ్లలో ఎరువు పడితేనే పంటకు బలం. ఎరువు ఎక్కడ పడాలో సరిగ్గా అక్కడే వేసే 'స్పాట్ ఫెర్టిలైజర్ అప్లికేటర్' యంత్రాన్ని సొంతగా తయారు చేశాడు జలేనదార్. మార్కెట్ లో దొరికే ఫెర్టిలైజర్ అప్లికేటర్ల కంటే.. ఈ రైతు తయారు చేసిన పొడవాటి గొట్టంలాంటి యంత్రం చాలా తక్కువ ఖర్చుతో రూపొందింది.

Telangana farmer Chintakinda Jalenadar innovated a low cost spot fertilizer applicator

ఇన్నోవేటర్లకు ప్రోత్సాహం
ఔత్సాహిక ఇన్నోవేటర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో టీఎస్ఐసీ గతంలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. ఇండిపెండెంన్స్ డే సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లా నుంచి దాదాపు 300 మంది ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. వారిలో రైతులు, వ్యవసాయ అనుబంధ ఐడియాలతో వచ్చినవారే ఎక్కువమంది కావడం విశేషం.

English summary
a farmer of telangana innovation low cost spot fertilizer applicator gets huge appreciation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X