వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్... జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: కరోనావైరస్ ఇటు దేశంలో అటు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఇక నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే క్రమంలో ప్రజాప్రతినిధులు కూడా కరోనాబారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారిన పడగా తాజాగా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తానే స్వయంగా ట్విటర్ వేదికగా చెప్పారు.

కరోనావైరస్ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో టెస్టులు చేయించుకున్నట్లు చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రిపోర్టులు వచ్చాయని అయితే పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆయన చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని అంతా సవ్యంగానే ఉందని చెప్పిన మంత్రి హరీష్ రావు... ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కానీ ప్రజాసమస్యలు తెలుసుకునే క్రమంలో తనతో పాటు దగ్గరగా ప్రయాణించినవారు జాగ్రత్తగా ఉండాలని వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. అంతేకాదు కొద్ది రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలని అన్నారు.

Telangana Finance Minister Harish Rao tests positive for Covid, Confirms with tweet

ఇదిలా ఉంటే తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2511 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసులు 1,38,395కు చేరుకోగా మృతుల సంఖ్య 877కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 2579 మంది కోలుకున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 305 కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

English summary
Telangana Finance minister Harish Rao tested positve for Corona and this was tweeted by the minister himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X