వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలోనూ 'బ్లాక్ ఫంగస్' కలకలం... భైంసాలో బయటపడ్డ 3 కేసులు... ఒకరి మృతి

|
Google Oneindia TeluguNews

ఓవైపు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు సతమతమవుతుంటే 'బ్లాక్ ఫంగస్' రూపంలో మరో పెను సవాల్ ఎదురవుతోంది. మొదట గుజరాత్,ఢిల్లీల్లో బయటపడిన ఈ కేసులు క్రమంగా దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలోనూ బ్లాక్ ఫంగస్(మ్యుకోర్‌మైకోసిస్) కేసులు బయటపడ్డాయి. స్థానికంగా కరోనా సోకిన ముగ్గురిలో ఈ ఇన్ఫెక్షన్ బయటపడింది. ఇందులో ఒకరు మృతి చెందడం గమనార్హం. మిగతా ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా గండంనుంచి బయటపడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్న వేళ బ్లాక్ ఫంగస్ రూపంలో మరో మహమ్మారి దాడి మొదలవడం కలకలం రేపుతోంది.

గాంధీలోనూ 3 బ్లాక్ ఫంగస్ కేసులు

గాంధీలోనూ 3 బ్లాక్ ఫంగస్ కేసులు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. అయితే బ్లాక్ ఫంగస్‌ కొత్తగా వస్తున్న వ్యాధి కాదని... దానిపై ఎక్కువగా ఆందోళన చెందవద్దని అన్నారు. అనవసరంగా రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్ బారినపడే ప్రమాదం ఉందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతారని చెప్పారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే రెమ్‌డిసివిర్‌ అధికంగా ఇవ్వడం వల్ల బ్లాక్ ఫంగస్‌కు దారి తీసే అవకాశం ఉందని మెడికల్ పరిశోధనలు చెబుతున్నాయి.

దడ పుట్టిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ 50 కేసులు... అప్రమత్తంగా ఉండాలన్న సీఎం...దడ పుట్టిస్తున్న 'బ్లాక్ ఫంగస్'... మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ 50 కేసులు... అప్రమత్తంగా ఉండాలన్న సీఎం...

మహారాష్ట్రలో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు

మహారాష్ట్రలో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు

భైంసా మహారాష్ట్రకు సరిహద్దులో ఉంటుంది. మహారాష్ట్రలో ఇటీవల 2వేల పైచిలుకు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు గ్రామాలు,పట్టణాలకు బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతోందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ ఫంగస్ చికిత్సపై ఫోకస్ చేసింది. ఈ వ్యాధి చికిత్స కోసం అవసరమయ్యే ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లు లక్ష వరకు తెప్పించుకునే ప్రయత్నాల్లో ఉంది.

కరోనా: కోలుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్... సూరత్‌లో 40 కేసులు, 8మందికి అంధత్వం.. లక్షణాలివే...కరోనా: కోలుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్... సూరత్‌లో 40 కేసులు, 8మందికి అంధత్వం.. లక్షణాలివే...

ప్రభుత్వం అలర్ట్...

ప్రభుత్వం అలర్ట్...


కేంద్ర ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముందు జాగ్రత్తలో భాగంగా ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే యాంటీ ఫంగల్ డ్రగ్ ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మాన్యుఫాక్చర్ సంస్థలతో కేంద్రం చర్చలు మొదలుపెట్టింది. అలాగే ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లను ప్రభుత్వ,ప్రైవేటుతో పాటు ప్రజారోగ్య సంరక్షణ కేంద్రాలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

మొదట గుజరాత్‌లో...

మొదట గుజరాత్‌లో...


కొద్దిరోజుల క్రితం మొదట గుజరాత్‌లో 40-45 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇందులో కొంతమంది కంటిచూపు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కర్ణాటక,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్‌లలో ఈ కేసులు వెలుగుచూశాయి. తాజాగా తెలంగాణలోనూ ఐదు కేసులు బయటపడ్డాయి. ఈ వ్యాధికి చికిత్స ఉన్నప్పటికీ.. ఆ విషయంలో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. గాలి ద్వారా సోకే ఈ వ్యాధి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. వ్యాధి సోకినవారిలో తలనొప్పి,కళ్లు ఎర్రబడటం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి.

English summary
Five black fungus cases were reported in Bhainsa,Nirmal district,Telangana.Among the five one was died in the hospital on Thursday.Secunderabad Gandhi hospital DME responded on these cases and said even three black fungus case were there in Gandhi also.He said need not worry about this infection as it is not a new virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X