వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: పీపుల్స్ ప్లాజాలో ధూంధాం, ఘుమఘుమలు, ఏపీలో దీక్షలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది. అన్ని కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లోను తెలంగాణ వారు అవతరణ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్నారు.

తెలంగాణ సంబరాల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.2 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. మండల, జిల్లా స్థాయి కళాకారులు, కవులు, వివిధ రంగాల్లోని నిపుణులకు పురస్కారాలు అందచేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 2 (శనివారం) రవీంద్ర భారతిలో ప్రభుత్వ పురస్కారాలను పొందనున్న వారిని సత్కరిస్తారు.

సంబురాలు శుక్రవారమే ప్రారంభమయ్యాయి. యువత రూపొందించిన షార్ట్ పిలిమ్స్‌తో నాలుగు రోజుల పాటు రోజు సాయంత్రం ఐదు గంటలకు ఫిల్మోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్తమ లఘు చిత్రాలకు 5వ తేదీన అవార్డులు ప్రదానం చేస్తారు. పీపుల్స్ ప్లాజాలా శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు ధూంధాం, ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాలతో ఫుడ్ పెస్టివెల్ నిర్వహిస్తున్నారు.

గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్

గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్

జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ఆయన గన్ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు.

 అందరినీ ఆకర్షిస్తున్నాయి

అందరినీ ఆకర్షిస్తున్నాయి

తెలంగాణ రాష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. తెలంగాణలోని నగరాలు, పట్టణాలు పల్లెలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎక్కడ చూసినా విద్యుద్దీపకాంతులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆకృతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

రంగురంగుల విద్యుత్ బల్బులు

రంగురంగుల విద్యుత్ బల్బులు

హైదరాబాద్‌లోని వీధుల్లో చెట్లకు రంగురంగుల విద్యుత్ బల్బులను అలంకరించారు. భవనాలకు, ఫ్లై ఓవర్లకు కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి పూట నగరం వెలిగిపోతోంది. వీటి వద్ద నగర యువత సెల్ఫీలు తీసుకుంటా ఆనందిస్తున్నారు.

గన్‌ పార్కులోని అమరవీరుల స్తూపం మొదలు, అసెంబ్లీ, రవీంద్రభారతి, అన్ని ఫ్లై ఓవర్లు, ప్రభుత్వ కార్యాలయాలు అందంగా అలంకరించబడ్డాయి.

శుక్రవారం నుంచే సంబరాలు

శుక్రవారం నుంచే సంబరాలు

సంబరాలు శుక్రవారమే ప్రారంభమయ్యాయి. యువత రూపొందించిన షార్ట్ పిలిమ్స్‌తో నాలుగు రోజుల పాటు రోజు సాయంత్రం ఐదు గంటలకు ఫిల్మోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్తమ లఘు చిత్రాలకు 5వ తేదీన అవార్డులు ప్రదానం చేస్తారు. పీపుల్స్ ప్లాజాలా శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు ధూంధాం, ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాలతో ఫుడ్ పెస్టివెల్ నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ సర్కిల్ వరకు శుక్రవారం ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3కే రన్ నిర్వహించారు. ఈ రన్‌లో పుల్లెల గోపీచంద్ తదితర ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

కేసీఆర్ వైఫల్యాలపై కరపత్రాలు పంచుతాం: ఉత్తమ్

నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, వైఫల్య పాలనపై కరపత్రాలు పంచుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హమీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

ప్రజలను మోసం చేయటం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని చెప్పినా కాంగ్రెస్ అమలు చేసి చూపిందన్నారు. గతంలోనూ జాతీయ స్థాయిలో రైతు రుణమాఫీ చేసిన ఘనత తమదే అన్నారు.

ఓ వైపు తెలంగాణలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరుపుతుండగా, మరోవైపు ఏపీలో టీడీపీ, వైసీపీలు పోటాపోటీ దీక్షలకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష అంటుండగా, జగన్ వంచన దీక్ష అంటున్నారు.

English summary
A 3-km run from Telangana Bhavan encircling India Gate and back to Telangana Bhavan was organised on Friday as part of Telangana Formation Day celebrations here from 31 May to 3 June. About 200 people, including badminton coach Pullela Gopichand and several dignitaries, participated in the programme. As part of Telangana Formation Day, several programmes are being organised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X