వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్ బాధలకు చెక్: ఎన్నారై పాలసీపై కెటిఆర్ కసరత్తు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే తెలంగాణ ఎన్నారైల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలసీ(విధానం) తీసుకురానుంది. ఈ పాలసీని రూపొందించే దిశగా ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రాష్ట్ర ఐటీ, ఎన్నారై శాఖ మంత్రి కెటి రామారావు చర్యలు ప్రారంభించారు. ఈ పాలసీని ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి ప్రయోజనం కలిగేలా రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

తెలంగాణలో యువత ఆకాంక్షలు ఫలించేలా ముఖ్యంగా గల్ఫ్ ఉపాధి వంటి సమస్యలకు పరిష్కారం దొరికేలా పాలసీ రూపొందించేందుకు మంత్రి ప్రత్యేక విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నారై పాలసీలను ఆయన స్వయంగా పరిశీలించారు. అందులోని ప్రధానమైన అంశాలను స్వీకరించాలని యోచిస్తున్నారు.

ktr

తెలంగాణలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే యువతకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పాలసీ ఉండబోతోంది. ఇప్పటికే అధికారులతో చర్చలు నిర్వహించిన మంత్రి కేటీఆర్ వచ్చే వారంలో ఎన్నారై సంఘాలతో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల కోసం పనిచేస్తున్న సంస్థలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కార్మికశాఖతోపాటు మరికొన్ని సంబంధిత ప్రభుత్వ శాఖాధికారులను కూడా హాజరుకావాల్సిందిగా మంత్రి సూచించారు.

విదేశాలకు వెళ్లే యువత మోసాలకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకోవడంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలోనే విదేశాల్లో దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురైనవారికి, మరణించినవారికి అందాల్సిన సహాయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో సంఘాలను, పలువురు ప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు.

గత కొన్నేళ్లుగా వీరు విదేశాల్లో కార్మికుల, ప్రవాస తెలంగాణ బిడ్డల ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వారినుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించనున్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత పాలసీని తీసుకువచ్చే విధంగా మంత్రి కెటిఆర్ కసరత్తు చేస్తున్నారు.

English summary
The Telangana government will soon formulate a policy for NRIs from the state. Minister in-charge of NRI affairs KT Rama Rao is expected to meet with representatives of NRI associations and organisations working for the welfare of NRIs in Gulf states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X