వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 సార్లు తిరిగితే రూ 50 లక్షలు: టీజీ వెంకటేష్‌ పేరును ప్రస్తావించిన హరీష్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ పేరును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తావించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ పేరును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తావించారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీష్‌రావు టీజీ వెంకటేష్ పేరును ప్రస్తావించారు.

సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రస్తావన వచ్చింది. మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను సభ్యులకు వివరించారు.

Telangana governament relesed funds every assembly segment, says Harish Rao

"గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీజీ వెంకటేష్ మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండేవారు..శంకర్రావు కూడా అప్పట్లో మంత్రిగా ఉన్నారు కానీ మా నియోజకవర్గానికేమో ఒక కాలువలేదు. ఆ కాలువ కోసం టీజీ ఆఫీసు చుట్టూ తిరుగివాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు. మంత్రి టిజీ వెంకటేష్ కార్యాలయం చుట్టు 20 చక్కర్లు కొడితే రూ. 50లక్షలు వస్తుండేవని ఆయన గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు రోజులు మారాయి ఇవాళ మీరు ఎవరైనా అడిగారా మాకు ఒక్కరైనా దరఖాస్తు ఇచ్చారా?" అని ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆయన అడిగారు. దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని చెరువులు, అన్ని ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఘనత టీఆర్ఎస్‌దే అని మంత్రి హరీష్ చెప్పారు.

English summary
Telanga Irrigation minister Harish Rao said that governament released funds every assembly segment. He Rembered United Ap governament perfomance in funding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X