వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

122 శాతం కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఫేక్: గ్రాఫిక్స్‌ డేటా తప్పుల తడక, నిరాధారంగా రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు.. రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి 122 శాతం అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనిని చూసి కొందరు ఆందోళన చెందుతుండగా.. వైద్యారోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. అదీ ఫేక్ అని స్పష్టంచేసింది.

122 శాతం అట

122 శాతం అట

భారతదేశం మ్యాపులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఉంది. దీనిని ఇండియా.ఇన్.పిక్సెల్స్ రూపొంచింది. దేశంలో వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ 65 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం 122 శాతం ఉంది అని సూచించింది. దీనిని వైద్యారోగ్యశాఖ ఖండించింది. గ్రాఫిక్స్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదని.. దీని వెనక వైద్యుడు/నిపుణులు లేరు అని.. ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన గ్రాఫిక్స్‌కు శాస్త్రీయ ఆధారం ఏముంటుందని ప్రశ్నించింది.

తప్పుడు సమాచారం

తప్పుడు సమాచారం

తెలంగాణ రాష్ట్రంలో 2933 మంది మాత్రమే క్వారంటైన్ చేశారనే తప్పుడు అంశాన్ని ప్రస్తావించిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆ సంఖ్య దాని కన్నా ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈ డేటాను ఆరోగ్య సేత యాప్ ద్వారా తీసుకున్నట్టు తెలుస్తోందని.. అయితే రాష్ట్రంలో అందరూ యాప్ ఉపయోగించడం లేదు కదా అని కొశ్చన్ చేశారు. ఓ వ్యక్తి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని ఎలా అంచనా వేశారు అని ప్రశ్నించారు.

Recommended Video

JC Prabhakar Reddy అరెస్ట్ | JC Travels పై ఇన్ని కేసులా ?
872 కేసులు

872 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో సోమవారం 872 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య 8 వేల 674కి చేరింది. 4005 మందిని డిశ్చార్జ్ చేయగా.. 4 వేల 452 మందికి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. బల్దియాలో 713 కేసులు రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు.. ఇతర జిల్లాల్లో 10 కేసులు నమోదయ్యాయి.

English summary
Telangana government denied claims that the state was at a higher risk of community transmission of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X