వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరటికోళ్లతో మంచి రాబడి.. 325/-కే 25 కోడి పిల్లలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పెరటికోళ్ల పెంపకాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పేదలకు ఉపాధి కల్పించే నిమిత్తం ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇన్‌సెంటివ్ లైవ్ స్టాక్, పౌల్డ్రీ ప్రొడక్షన్ పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రోత్సాహం కల్పించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 507 యూనిట్ల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది స్టేట్ గవర్నమెంట్.

పెరటికోళ్ల పెంపకం

పెరటికోళ్ల పెంపకం

పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొనసాగనున్న పెరటికోళ్ల పెంపకానికి సంబంధించిన జిల్లాకు 507 యూనిట్లు కేటాయించారు. అందులో ఎస్సీలకు 335, ఎస్టీలకు 172 యూనిట్లుగా పేర్కొన్నారు. ఒక్కొక్క యూనిట్ కు సంబంధించి 25 కోడి పిల్లలుంటాయి. దాదాపు నెల వయస్సున్న కోడి పిల్లల్ని ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులను ఎంపికచేసి వారికి కోడిపిల్లల్ని అందించడమే గాకుండా పెంపకంపై తగిన జాగ్రత్తలు, సూచనలు అందించనున్నారు పశువైద్య అధికారులు. అదేవిధంగా అవసరమైన మందులు కూడా వారే ప్రొవైడ్ చేస్తారు. రెండు నెలల్లోపే దాదాపు 2 కిలోల వరకు బరువు పెరిగే పెరటికోళ్లు మంచి ఆదాయం అందిస్తాయి.

1250 సబ్సిడీ.. 325 కడితే చాలు

1250 సబ్సిడీ.. 325 కడితే చాలు

కుటీర పరిశ్రమగా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు ఆసరా దొరికినట్లవుతుంది. ఒక్కో యూనిట్ కు 1575 రూపాయలు ఖర్చు అవుతుండగా.. 1250 రూపాయలను ప్రభుత్వం భరించనుంది. మిగతా 325 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి డీడీ తీసి ఆధార్ కార్డు జిరాక్స్ జతపరిచి స్థానిక పశువైద్యాధికారికి దరఖాస్తులు అందించాల్సి ఉంటుంది.

పెరటికోళ్లతో అధిక రాబడి

పెరటికోళ్లతో అధిక రాబడి

ఇదివరకు నాటుకోళ్ల పెంపకం గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది. మంచి రాబడి ఇచ్చే ఈ కోళ్ల పెంపకం రానురాను కనుమరుగవుతోంది. పోషక విలువలుండే ఈ నాటుకోళ్లకు మార్కెట్లో డిమాండ్ బాగానే ఉంటోంది. వీటిని పెంచేవారికి కూడా చెప్పుకోదగినంత ఆదాయం లభిస్తోంది. ఈ క్రమంలో పెరటికోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందించాలని డిసైడయింది ప్రభుత్వం. ఇంటి దగ్గర ఉండి ఆదనపు ఆదాయం కావాలనుకునేవారికి ఇది మంచి పథకం. 75 శాతం రాయితీపై దాదాపు నెల రోజులున్న కోడి పిల్లలను అధికారులు పంపిణీ చేయనున్నారు.

 తక్కువ కాలంలో ఎక్కువ బరువు

తక్కువ కాలంలో ఎక్కువ బరువు

పెరటికోళ్లు అతి తక్కువ కాలంలోనే బరువు పెరుగుతాయి. కేవలం 2 నెలల వ్యవధిలో దాదాపు 4 కిలోల వరకు వెయిట్ వస్తాయి. అంతేకాదు ఏడాదికి సుమారుగా 150 గుడ్లు పెడతాయి. నాటుకోడి గుడ్ల కంటే పెరటికోళ్ల గుడ్లు సైజులో కొద్దిగా పెద్దగానే ఉంటాయి. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్. పెరటికోళ్ల మాంసంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటి మాంసానికి ఫుల్ గిరాకీ. పెరటికోళ్లను పెంచడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. అంతేకాదు సబ్సిడీపై కోడి పిల్లలను ఇస్తుండటంతో మంచి లాభసాటి వ్యాపారంగా మలచుకోవచ్చు.

 పెట్టుబడి స్వల్పం.. లాభాలు అధికం

పెట్టుబడి స్వల్పం.. లాభాలు అధికం

పెరటికోళ్ల పెంపకంలో పెట్టుబడి తక్కువ, లాభాలెక్కువగా కనిపిస్తాయి. వీటిని పెంచడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ అవే ఆహారం సమకూర్చుకుంటాయి. ప్రత్యేకంగా ధాన్యాలు గట్రా పెట్టాల్సిన పనిలేదు. నాటుకోళ్ల మాదిరిగానే పెరటికోళ్ల పెంపకం కూడా చాలా ఈజీయే. మాంసం విషయంలో నాటుకోళ్ల కంటే రెండింతలు బరువు ఎక్కువగా వస్తాయి. కోడిగుడ్ల విషయంలో మూడింతల తేడా ఉంటుంది. నాటుకోళ్లు ఏడాదికి 50 గుడ్లు పెడితే.. పెరటికోళ్లు సుమారుగా 150 వరకు గుడ్లు పెడతాయి.

English summary
The state government has been entrusted with the expansion of the yard chickens scheme. Implementing this scheme is to provide employment to the poor. SC / ST in rural areas can be benefited by this scheme. The State Government has issued orders for 507 units per district for the year 2018-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X