వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షేక్‌ల వివాహాలకు అడ్డుగట్ట.. చట్ట సవరణపై సర్కార్ నజర్.. ఏజీ పరిశీలనకు ఆర్డినెన్స్

హైదరాబాద్ పాతబస్తీలో పెండ్లిండ్ల పేరిట అరబ్ షేక్‌ల మోసాలు, దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అందుకు అవసరమైన నిబంధనలతో చట్ట సవరణలతో ఆర్డినెన్స్ జారీ చేయ సంకల్పించింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ పరిధిలో షేక్‌ల ఆగడాలకు కళ్లెం వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అభం శుభం తెలియని బాలికలను పెండ్లి చేసుకుని.. తమ మోజు తీర్చుకుని తర్వాత వంచిస్తున్న షేకుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.

విదేశీయులతో పెళ్లిళ్లకు కఠిన నిబంధనలు విధించడానికి మైనారిటీ సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది.
ముస్లింల వివాహాలకు ప్రధానంగా విదేశీయులతో పెళ్లి చేస్తున్నప్పుడు కచ్చితంగా ఆధార్‌ కార్డును వయసు ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని భావిస్తోంది.

ఈ మేరకు 1880 నాటి చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది. ఈ విషయమై ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను అడ్వకేట్‌ జనరల్‌ పరిశీలనకు పంపినట్లు సమాచారం.

 ఖాజీలను కట్టడి చేసేందుకు నిబంధనలు కఠినతరం

ఖాజీలను కట్టడి చేసేందుకు నిబంధనలు కఠినతరం

వారం, పది రోజుల్లో మైనారిటీ వివాహ చట్టానికి తుది రూపం రావచ్చునని తెలిసింది. ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి వచ్చే వృద్ధులు ఇక్కడి దళారులను ఆశ్రయించి అమాయక పేద ముస్లింల కుటుంబాల్లోని చిన్నారులను పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డబ్బులకు ఆశపడి అమాయక బాలికలను బలి చేస్తున్న ఖాజీలను కట్టడి చేయడంతోపాటు కేవలం పెళ్లి కోసమే విదేశాల నుంచి వచ్చే మోసగాళ్లకు ముకుతాడు వేయడానికి.. పెళ్లి చేసుకోదలిచిన వధూవరుల మధ్య వయసు వ్యత్యాసం 10 ఏళ్లకు మించి ఉండరాదని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.

డిప్యూటీ ఖ్వాజీలకు గుర్తింపు కార్డుల జారీ

డిప్యూటీ ఖ్వాజీలకు గుర్తింపు కార్డుల జారీ

వధూవరుల మధ్య పదేళ్లకు మించి వ్యత్యాసం ఉంటే, ఇరు కుటుంబాలు, పెళ్లి చేసుకునే యువతి అభిప్రాయాన్ని మరోసారి ప్రత్యేకంగా తెలుసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. పెళ్లి తంతు నిర్వహించేందుకు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు గుర్తించిన 13 మంది ఖాజీలకు సహాయకులుగా వ్యవహరిస్తున్న డిప్యూటీ ఖాజీల అర్హతలను పరిశీలించి, వారికి కూడా గుర్తింపు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. పెళ్లి చేసుకునే మహిళల వయసు ధ్రువీకరణకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలుంటే పాటిస్తామంటున్న ఖ్వాజీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలుంటే పాటిస్తామంటున్న ఖ్వాజీలు

పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని (ఎన్‌వోసీ) ధ్రువీకరించిన పత్రాన్ని ఆయా దేశాల్లోని సంబంధిత అధికారుల నుంచి వరుడు తీసుకోవాలి. పెళ్లికి సుమారు నెల రోజుల ముందుగా అమ్మాయి కుటుంబం నివసించే ప్రాంతంలోని పోలీస్‌‌స్టేషన్‌లో సమర్పించాలి. నెల రోజుల్లో పోలీసులు వాటిని పరిశీలించి, అవి అధికారికంగా జారీ చేసినవేనని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కాగా, కొంత మంది నిర్వాకంతో తాము సైతం అప్రతిష్ఠపాలు కావాల్సి వస్తోందని ఖాజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా ఆదేశాలు ఉంటే వాటినే పాటిస్తామని వివరిస్తున్నారు.

 ‘ఆధార్'తో బాల్య వివాహాల నియంత్రణ

‘ఆధార్'తో బాల్య వివాహాల నియంత్రణ

బర్త్‌ సర్టిఫికెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేక పోవడంతో అనర్థాలు జరుగుతున్నాయని, ఆధార్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటే బాల్య వివాహాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చట్టంలో సవరణలు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ నిర్ణయించింది.

English summary
Telangana Government has ready to restricts to Arab Shaikhs on marriages. In this context government to amend the muslim marriages act with ordinance. Ordinance draft presently in front of Advocate General. Aadhar Card will compulsary in that marriages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X