హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హోమ్ ఐసోలేషన్ కిట్స్... ఇక ఇంటి వద్దకే... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్‌గా తేలి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి... ఇంటివద్దకే 'ఐసోలేషన్ కిట్'ను సప్లై చేయాలని నిర్ణయించింది. రోగికి అవసరమైన మెడిసిన్,యాంటీ బయాటిక్స్,శానిటైజర్స్,మాస్కులు తదితరాలన్నీ ఇందులో ఉండనున్నాయి. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో శుక్రవారం(జూలై 10) ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా మందు అందుకుంటున్న తొలి 5 రాష్ట్రాల్లో తెలంగాణ: రెండో విడత విజయవాడకుకరోనా మందు అందుకుంటున్న తొలి 5 రాష్ట్రాల్లో తెలంగాణ: రెండో విడత విజయవాడకు

పేషెంట్స్ ఇబ్బందిపడకూడదనే...

పేషెంట్స్ ఇబ్బందిపడకూడదనే...

కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో... వ్యాధి తీవ్రత అంతగా లేనివారిని హోమ్ ఐసోలేషన్‌కు రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ పేషెంట్లు బయటకొచ్చే అవకాశం ఉండదు కాబట్టి... వారికి అవసరమైన మెడిసిన్స్ అన్నింటినీ ప్రభుత్వం ఇంటి వద్దకే చేర్చాలని నిర్ణయించింది. 17 రోజుల కు అవసరమయ్యే మెడిసిన్,వస్తువులను కిట్ ద్వారా అందించనుంది.

నిర్దారణ అయిన వెంటనే...

నిర్దారణ అయిన వెంటనే...

హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి వీలైనంత త్వరగా కిట్లను సప్లై చేయాలని మంత్రి ఈటల అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఎవరికైనా పాజిటివ్‌గా నిర్దారణ అయితే.. వెంటనే సమీప ఆస్పత్రి నుంచి బాధితుని ఇంటికి కిట్ సప్లై చేయాలని చెప్పారు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది కరోనా బాధితులుంటే.. వారందరికీ కిట్స్ అందజేయాలని చెప్పారు. అలాగే ప్రతీరోజూ వైద్య సిబ్బంది కరోనా పేషెంట్ ద్వారా మాట్లాడటం తప్పనిసరి.

Recommended Video

KCR, KTR ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా..? || Oneindia Telugu
కిట్‌లో ఏమేమీ ఉంటాయి...

కిట్‌లో ఏమేమీ ఉంటాయి...

పారాసిటమాల్,హైడ్రాక్సిక్లోరోక్విన్,శానిటైజర్స్,మాస్కులు,గ్లౌజులు,యాంటీ బయాటిక్స్,విటమిన్ సి,విటమిన్ ఇ,విటమిన్ డి,లివోసెటిరిజైన్,ఎసిడిటీ మెడిసిన్‌ తదితరాలను కిట్ ద్వారా అందించనున్నారు. అలాగే హోమ్ ఐసోలేషన్‌ పీరియడ్‌లో ఏం చేయాలి... ఏం చేయకూడదు అన్న విషయాలను తెలియజేసే ఓ బ్రౌచర్‌ను కూడా అందజేస్తారు.

English summary
Telangana health minister Etela Rajender ordered medical officials to supply home isolation kits for coronavirus patients,he took this decision on a meeting held at Koti medical office on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X