హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త సర్పంచుల చేతికి సరికొత్త కొరడా : కలిసొచ్చేనా, బాధ్యత పెరిగేనా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గ్రామపంచాయతీల నిర్వహణలో సర్పంచులే కీలకంగా ఉండటంతో వారి సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులోభాగంగా కొత్త సర్పంచులకు మరో కీలక బాధ్యత అప్పగించాలని చూస్తోంది. వారి చేతికి సరికొత్త కొరడా అందించడానికి సిద్దమవుతోంది. అయితే ఈ ప్లాన్ కొత్త సర్పంచులకు భారంగా మారుతుందా? లేదంటే కలిసొస్తుందా అనేది చర్చానీయాంశంగా మారింది.

సర్పంచుల చేతికి..!

సర్పంచుల చేతికి..!

గ్రామీణ ప్రాంతాల్లో అటవీ సంపద పరిరక్షణ కోసం కొత్త సర్పంచుల సేవల్ని వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ మేరకు అటవీ ప్రాంతాల్లోని
సమీప పల్లెల్లో అటవీ రక్షక దళాలు ఏర్పాటు చేయాలనుకుంటోంది. వీటి బాధ్యత సర్పంచులకు అప్పగించాలని యోచిస్తోంది. అందులోభాగంగా వారికి అవగాహన కల్పించాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి అటవీ రక్షణ కమిటీ సమావేశంలో అటవీ సంపదను కాపాడటంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ తదితర విషయాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. పులుల రక్షణ కోసం స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని డిసైడయ్యారు.

ఆ రెండు చోట్ల..!

ఆ రెండు చోట్ల..!

కవ్వాల్, అమ్రాబాద్ టైగర్అభయారణ్యంలోని పులులు, వన్యప్రాణులకు రక్షణ కల్పించేందుకు అటవీ రక్షక దళాలను తెరపైకి తీసుకొస్తున్నారు. 112 మంది సిబ్బందితో ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటు కానుంది. ఈ రెండు చోట్ల ముగ్గురు రేంజ్ ఆఫీసర్లతో పాటు 81 మంది గార్డులు, 26 మంది వాచర్లు నిరంతరం పనిచేయనున్నారు. అయితే ఈ బృందం నిర్వహణకు అయ్యే ఖర్చును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40, 60 శాతం చొప్పున
భరించనున్నాయి.

అటవీ సంపద పరిరక్షణే ధ్యేయం

అటవీ సంపద పరిరక్షణే ధ్యేయం

అడవుల్లో ఫైర్ యాక్సిడెంట్ల నివారణకు తగిన చర్యలు తీసుకోనున్నారు అధికారులు. దీనికోసం 2 కోట్ల 25 లక్షల రూపాయలు విడుదల చేసేందుకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ సూచనలతో సంబంధిత శాఖలను సమన్వయం చేయనున్నారు. అడవుల రక్షణ కోసం సమీకృత ప్రణాళికను రెడీ చేసి అమలు చేయాలని డిసైడయ్యారు. చెట్ల నరికివేతను అడ్డుకోవడంతో పాటు వేటను అరికట్టడం, అటవీనేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కమిటీ ఓకే చెప్పింది. అంతేకాదు అవసరమైతే పీడీ యాక్టు కేసులు పెట్టడానికి గ్రీన్ సిగ్నలిచ్చింది. జంతువులను వేటాడటానికి విద్యుతును వాడితే అక్రమ వినియోగం, కరెంట్ చౌర్యం కింద కేసులు పెట్టాలని సూచించారు సీఎస్. ఫారెస్ట్ ఏరియాల్లోని విద్యుత్ శాఖ ఉద్యోగులు సైతం సంబంధిత విషయాలపై నిరంతరం నిఘా పెట్టాలని కోరారు.

English summary
The Government of Telangana would like to use sarpanch's in another way also. The new sarpanch's will be entrusted with another key responsibility. Getting ready for a new hatch of their hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X