వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

399 మంది ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష! ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం

|
Google Oneindia TeluguNews

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పంద్రాగస్టు రోజున రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం 399 మందికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతరం చేసినట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన వీరిని.. వివిధ జైళ్ల నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.

 telangana government plans release 399 prisoners 15th august

ఖైదీల విడుదలకు సంబంధించి విధివిధానాలను పది రోజుల్లో పూర్తి చేయాలని హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్ల నుంచి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తోంది. 2016 నుంచి ఖైదీలను విడుదల చేస్తూ వస్తుంది. జీవిత, తక్కువ శిక్షాకాలం ఖైదీలను ఎంపిక చేసి రిలీజ్ చేస్తుంది.

గతంలో మాదిరిగానే ఈ సారి కూడా క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. ఖైదీలు, వారి కుటుంబీకులు, రాజకీయ పార్టీ నేతుల, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం విడుదల చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

English summary
telangana government plans release 399 prisoners 15th august and cm kcr agree to prisoners release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X