వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలప స్మగ్లర్లపై స్పెషల్ నజర్..! పీడీ యాక్ట్ పెడతామన్న కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీఎం కేసీఆర్. కలప స్మగర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే గాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అడవులకు సంబంధించి పలు అంశాలపై ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. అడవుల సంరక్షణతో పాటు కలప స్మగ్లర్లను అరికట్టడం తదితర విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అడవులను అడ్డగోలుగా నరికివేస్తూ కలప స్మగ్లింగ్ చేస్తున్నవారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు సీరియస్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. అటవీప్రాంతాల్లో చెక్ పోస్టులను పెంచాలని, ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసులను కలిపి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

telangana government ready to implement pd act on wood smugglers

అడవులను కాపాడే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న కేసీఆర్.. నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలోని అడవుల నుంచి పుల్ల కూడా బయటకు పోవద్దన్నారు. ఆ మేరకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అడవుల్లో ఎప్పటికప్పుడూ తనిఖీలు జరపాలని ఆదేశించారు.

English summary
telangana cm kcr warned wood smugglers as pd act implement if they do not turn. KCR directed to officials to take stern action against wood smugglers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X