వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కొత్త మంత్రులు ఫిక్స్... సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్ర క్యాబినెట్‌లోకి కొత్తగా ఆరుగురు సభ్యుల్ని తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. దీంతో కేబినెట్‌లో చోటు దక్కిన వారు సీఎం కేసిఆర్‌కు కృతజ్ఝతలు తెలిపారు.నూతన గవర్నర్ తమిళసాయి సౌందర్‌రాజన్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ విస్తరణ

సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ విస్తరణ

గత కొత్త రోజులుగా టీఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు సీఎం కేసిఆర్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్ర క్యాబినెట్‌లోకి ఆరుగురు మంత్రులను తీసుకోనున్నారు. పలు సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకున్న సీఎం కొత్తగా ఆరుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడ ఉండడం గమనార్హం. ప్రమాణ స్వీకారం సంబంధించి నూతన గవర్నర్ తమిళసాయి సౌందర్ రాజన్‌కు సమాచారం ఇచ్చిన సీఎం ప్రమాణం స్వీకారం చేపట్టబోయో సభ్యులకు కూడ సమాచారం అందించారు. దీంతో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యేలు సీఎం కేసిఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

కొత్త మంత్రులు వీరే....

కొత్త మంత్రులు వీరే....

కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారిలో టీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు,ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు. అందులో ఓసి వర్గానికి చెందిన మహిళ నేత ఇటివల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సబితా ఇంద్రారెడ్డి,తోపాటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సి సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాధినిథ్యం కల్గకపోవడంతో ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ను టీఆర్ఎస్ స్థానంలోకి తీసుకున్నారు. ఇక మరోసారి కరీంనగర్ జిల్లాకు సీఎం అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఇప్పటికే ఆ జిల్లా నుండి ఇప్పటికే మంత్రి ఈటల రాజెందర్ ‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోనే ఆదే జిల్లాకు మరో రెండు మంత్రిపదవులు కేటాయించారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేటీఆర్‌తో పాటు గంగుల కమలాకర్‌లకు స్థానం కల్పించారు.

ఎట్టకేలకు మహిళలకు స్థానం

ఎట్టకేలకు మహిళలకు స్థానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి కేబినెట్‌లో మహిళలకు ఎలాంటీ ప్రాతినిథ్యం కల్పించని సీఎం కేసీఆర్ అనేక విమర్శలను ఎదుర్కోన్నారు. ఈ నేపథ్యంలోనే రెండవసారి ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్‌కు భారీ మెజారీటీ వచ్చింది. అయినప్పటికి క్యాబినెట్‌లో మహిళలకు స్థానం చోటు కల్పించలేదు. అయితే ప్రస్థుతం చేపడుతున్న క్యాబినెట్‌ విస్తరణలో ఏకంగా ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. వీరిలో ఇటివల కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించారు.

English summary
The Telangana Government's Cabinet expansion will be held at 4 o'clock in the evening.Six new members will be taken oath at rajbavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X