వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామ పంచాయతీలకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. డీటెయిల్స్ ఇవే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు, రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలో గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తామని ఇక ఇదే సమయంలో రైతులకు 45 రోజుల్లో పంపు హౌస్ లలో సమస్యలను పరిష్కరింపజేసి వ్యవసాయానికి కావలసిన నీరు అందిస్తామని పేర్కొంది.

త్వరలో అన్ని పంచాయతీలకు నూతన భవనాలు .. వెల్లడించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

త్వరలో అన్ని పంచాయతీలకు నూతన భవనాలు .. వెల్లడించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్


త్వ‌ర‌లో నూత‌న‌ గ్రామ పంచాయ‌తీలకు కొత్త భ‌వ‌నాలను నిర్మిస్తామని, నిధుల కేటాయింపు, ఖ‌ర్చుపై చ‌ర్చించి మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌ కెసిఆర్ ఆదేశాల మేరకు త్వరలో దశలవారీగా నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ప‌రిపాల‌నా సౌల‌భ్యం - సంస్క‌ర‌ణ‌ల‌లో భాగంగా ఏర్పాటైన నూత‌న‌ గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ, సిఎం కెసిఆర్ గతంలో అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధుల‌తో వారి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ లు తెలిపారు.

కొత్తగా ఏర్పడిన తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ గ్రామ పంచాయతీ భవనాలు

కొత్తగా ఏర్పడిన తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ గ్రామ పంచాయతీ భవనాలు

అలాగే భ‌వ‌నాలు లేని పాత గ్రామ పంచాయ‌తీల్లోనూ కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తామ‌న్నారు. కొత్త‌గా గ్రామ పంచాయ‌తీలుగా ఏర్ప‌డ్డ లంబాడీ తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌ని మంత్రులు ప్రకటించారు. ఈ విష‌య‌మై నిధులు, విధి విధానాలు, ప్ర‌ణాళిక‌లు వంటి ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లో చర్చలు జరిపారు. ఈ స‌మావేశంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజ‌న సంక్షేమ‌శాఖ కార్య‌ద‌ర్శి క్రిష్టినా జెడ్ చొంగ్తు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

4,745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం: మంత్రుల వెల్లడి

4,745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం: మంత్రుల వెల్లడి

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయ‌ని, అందులో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు లేని తండాలు 1,097 ఉండ‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయ‌ని వెల్లడించారు. అలాగే 2, 960 మైదాన ప్రాంత గ్రామ‌ పంచాయ‌తీల్లో భ‌న‌వాలు లేవ‌న్నారు. మొత్తం 4,745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం ఉంద‌న్నారు. వీటిలో ఇప్ప‌టికే సంబంధిత ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుండి అందిన ప్ర‌తిపాద‌న‌లు, ఇంకా ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి అందాల్సిన ప్ర‌తిపాద‌న‌ల‌ను బ‌ట్టి ద‌శ‌ల వారీగా తండాల‌కు, ఏజెన్సీ ప్రాంతాలకు, ఇత‌ర గ్రామాల‌కు ప్రాధాన్య‌తా క్ర‌మంలో కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను మంజూరు చేసి త్వరితగతిన నిర్మాణం చేస్తామని తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని గ్రామాల్లో కొత్త భ‌వ‌నాల ప‌నులు ప్ర‌గ‌తిలో ఉన్నాయ‌ని వెల్లడించారు.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన హరీష్ రావు

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన హరీష్ రావు


ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. గోదావరి వరదల వల్ల ముంపుకు గురైన కాళేశ్వరం పంప్ హౌస్ లలో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, రైతులకు వ్యవసాయానికి కావలసిన సాగునీటిని అందిస్తామని ఆయన తెలిపారు. 45 రోజుల్లో పంప్ హౌస్ లో సమస్యలు పరిష్కారమవుతాయని, ఖరీఫ్ పంట కు కావలసిన నీటిని అందిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.

సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి

సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి హరీష్ రావు.ప్రకృతి వైపరీత్యం వల్ల ఇటువంటి పరిణామాలు సంభవించాయని, అయితే తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం త్వరితగతిన సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. మొత్తానికి తెలంగాణ మంత్రులు గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు కడతామని, 45 రోజుల్లో సాగునీరు అందించి, త్వరలోనే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి.

English summary
good news to Gram Panchayats and farmers, the Telangana government has said that they will soon construct new Gram Panchayat buildings in a phased manner and solve the farmers' irrigation water problem in 45 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X