వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా సర్కార్: నిరుద్యోగ యువత ఉపాధికి కొత్త స్కీమ్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణా సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఉపాధిని అందించే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు . తెలంగాణ యువత, మహిళలకు సంబంధించి ఉపాధి అందించటానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది . ఇక నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా రెండు కీలక పథకాలను తీసుకొస్తుంది తెలంగాణ గవర్నమెంట్. త్వరలోనే టీఎస్ సర్కార్ ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పినట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ఆ ప్రముఖ కాలేజీలు బంద్ !! రెడీ అవుతున్న ఇంటర్ బోర్డ్హైదరాబాద్ లో నిబంధనలు పాటించని ఆ ప్రముఖ కాలేజీలు బంద్ !! రెడీ అవుతున్న ఇంటర్ బోర్డ్

నిరుద్యోగ యువతకు కేసీఆర్ ఆపద్బంధు పథకం

నిరుద్యోగ యువతకు కేసీఆర్ ఆపద్బంధు పథకం

బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఈ రెండు పథకాలను అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక ఒక పథకం విషయానికి వస్తే కేసీఆర్ ఆపద్బంధు. ఎంబీసీ యువకుల కోసం కేసీఆర్ అందిస్తున్న ఈ పథకం ద్వారా అర్హులైన ఎంబీసీ విద్యార్థులకు ఒక్కటి చొప్పున అంబులెన్స్‌లను పంపిణీ చేయనున్నారు. ఆపద్బంధు పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించటమే కాకుండా, మారుమూల ప్రాంతాలకు కూడా అంబులెన్స్ సేవలను విస్తరించడం జరుగుతుంది.

 అంబులెన్స్ లను అందించి ఉపాధి ఇచ్చే స్కీమ్

అంబులెన్స్ లను అందించి ఉపాధి ఇచ్చే స్కీమ్

మొదట జిల్లాకో అంబులెన్స్‌ చొప్పున పంపిణీ చేసి, వాటి విషయంలో వస్తున్న స్పందన చూసిన అనంతరం మరికొందరు నిరుద్యోగులను ఎంపిక చెయ్యనున్నారు . అంతే కాకుండా నిరుద్యోగ మహిళలకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. అంతే కాదు మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్‌ ల పంపిణీ చెయ్యనున్నారు.

Recommended Video

Telangana CM KCR Stops Convoy For Disabled Man | He Is The People Leader | Oneindia Telugu
మహిళలకు కుట్టు శిక్షణ , నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి

మహిళలకు కుట్టు శిక్షణ , నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి

దాదాపు 10 వేల మంది నిరుద్యోగ మహిళలను శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చెయ్యాలని నిర్ణయించారు. ఇంటి వద్ద ఉండే మహిళలు సైతం ఆర్ధిక స్వావలంబన సాధించేలా ఆదాయం చేకూరేలా ఈ పథకాన్ని అమలు పరచనున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తెలంగాణాలోని నిరుద్యోగ యువతకు అందించే ఈ పథకాలతో కొంతైనా నిరుద్యోగం తగ్గుతుందనే భావన వ్యక్తం అవుతుంది.

English summary
Telangana CM KCR will be rolling out innovative programs to provide employment to unemployed youth. Deciding to provide employment to the youth and women of Telangana, government steps into that direction. Telangana Government brings two key schemes specifically for unemployed youth. It is reported that Minister Gangula Kamalakar has announced that TS government will soon introduce these two schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X