వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరేళ్ళపై కెసిఆర్‌కు హైకోర్టు షాక్: అందరికీ ఒకేచోట గాయాలా?

నేరేళ్ళ ఘటనలో బాధితులందరికీ ఒకేచోట ఎందుకు గాయాలయ్యాయని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రదారులైన ఎస్పీ విశ్వజిత్, ఏఈలపై చర్యలు తీసుకోవాలని బాధితుల తరపున లాయర్ కోర్టును కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నేరేళ్ళ ఘటనలో బాధితులందరికీ ఒకేచోట ఎందుకు గాయాలయ్యాయని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రదారులైన ఎస్పీ విశ్వజిత్, ఏఈలపై చర్యలు తీసుకోవాలని బాధితుల తరపున లాయర్ కోర్టును కోరారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

నేరేళ్ళ ఘటనపై బుదవారంనాడు రాష్ట్ర ప్రభుత్వం వైద్య పరీక్షల నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో బాధితులకు తీవ్ర గాయాలైనట్టుగా వెల్లడించింది.

 Telangana government submits Nerella victims medical report

ఈ నివేదికను చూసిన హైకోర్టు బాధితులందరికీ ఒకేచోట ఎందుకు గాయాలయ్యాయని ప్రశ్నించింది. దీనికి గల కారణాలేమిటని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కరీంనగర్ ఆసుపత్రిలో బాధితులకు అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడ రెండు వారాల్లో అందించాలని కోర్టు ఆసుపత్రి సూపరింటెండ్‌ను ఆదేశించింది.

నేరేళ్ళ ఘటనకు బాధ్యుడిగా చేస్తే సిసిఎస్ ఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేసిపట్టుగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ఘటనపై పూర్తి నివేదికను రెండు వారాల్లో ఇవ్వాలని కరీంగనర్ రేంజ్ డిఐజిని కోర్టు ఆదేశించింది.

కరీంనగర్ సబ్‌జైల్లో వారంట్, గాయాలకు సంబంధించిన నివేదికను కూడ జైలు సూపరింటెండ్ రెండువారాల్లో ఇవ్వాలని కోర్టు జైలు సూపరింటెండ్‌ను ఆదేశించింది. నేరేళ్ళ ఘటనకు కరీంనగర్ జిల్లా ఎస్‌పి విశ్వజిత్, ఏఈ కీలక పాత్రదారులని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు లాయర్ కోర్టును కోరారు.

అయితే అన్ని నివేదికలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొంటామని కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.

English summary
Telangana government Nerella victims medical report submitted to High court on Wednesday. this case postponed to two weeks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X