వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంక్రాంతి సందర్భంగా.. ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా సర్కార్.. ఆ డబ్బు ఖాతాల్లో

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR Said Good News To TSRTC Workers For Sankranthi Festival ! || Oneindia Telugu

తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని 55 రోజుల పాటు సమీ చేసిన సమయంలో వారికి చెల్లించాల్సిన వేతనాలను ఆపివేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ ఉద్యోగులకు ఆ వేతనాలు చెల్లిస్తామని చెప్పి గుడ్ న్యూస్ చెప్పింది.

 ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు .. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన తెలంగాణా ఎంపీ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు .. సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన తెలంగాణా ఎంపీ

 ఆర్టీసీ కార్మికులకు చెల్లింపు చెయ్యని జీతాలను సంక్రాంతికి ఇస్తామన్న యాజమాన్యం

ఆర్టీసీ కార్మికులకు చెల్లింపు చెయ్యని జీతాలను సంక్రాంతికి ఇస్తామన్న యాజమాన్యం

తెలంగాణా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ,ఏపీ తరహాలో ఆర్టీసీని విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పదుల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు వదిలారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం కఠినం గా వ్యవహరించింది. సమ్మె సమయంలో జీతాలు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపించింది. ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగిరావటంతో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులకు చెల్లింపు చెయ్యని జీతాలను ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా చెల్లిస్తుంది.

 సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయం

సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయం

సమ్మె చేసిన 55 రోజులుకు గానూ జీతం ఇవ్వాలని నిర్ణయించింది. సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన అద్దె బస్సుల బకాయిలను కూడా చెల్లించింది యాజమాన్యం. మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో, బస్సులను నిలిపివేస్తామని అద్దె బస్సుల ఓనర్లు ఈడీకి లేఖ రాయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ నెలకు సంబంధించిన బకాయిలు రూ. 20 కోట్లు రిలీజ్ చేసింది

ఈ నెల 11న ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో సమ్మె కాలపు జీతం జమ

ఈ నెల 11న ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో సమ్మె కాలపు జీతం జమ


ఇక అంతే కాకుండా ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో 202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు. ప్రతి డిపో నుంచి ఒక సభ్యుడు ప్రాతినిథ్యం వహించేలా నియామకాలు జరిగాయి. రీజియన్ మేనేజర్లు సదరు సభ్యులను నామినేట్ చేశారు. వీరు ఆ డిపో పరిధిలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేయనున్నారు. మొత్తానికి ఇన్ని రోజుల పాటు చెల్లింపు చేయని ఆర్టీసీ కార్మికుల జీతాలు ఈ నెల 11న ఖాతాల్లో వేయనున్నారన్న శుభవార్త ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం తెచ్చింది.

English summary
It has been decided to pay the salaries of RTC workers when they are in 55 days strike. Officials said that 55 days 'wages would be given to the employees' accounts on the 11th of this month, four days before the day of the sankranthi festival . this is a good news to workers who are waiting for their wages on the strike days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X