వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు కాలాక, అవినీతి చేస్తే క్రిమినల్ కేసులే, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనకు కెసిఆర్ చర్యలు

మియాపూర్ భూకుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిమ్మతిరిగే అవినీతికి ఆలవాలంగా మారిన రిజిస్ట్రేషన్ల శాఖపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ గా దృష్టిపెట్టారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిమ్మతిరిగే అవినీతికి ఆలవాలంగా మారిన రిజిస్ట్రేషన్ల శాఖపై ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ గా దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్టార్లను బదిలీచేసింది తెలంగాణ ప్రభుత్వం.

రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు సుదీర్ఘకాలంగా ఒకే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్నవారిని బదిలీచేసింది. అంతేకాదు ఆకస్మాత్తుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎసిబీ దాడులు నిర్వహించింది.

మియాపూర్ భూకుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటోంది. ఏనీవేర్ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దుచేసింది. అంతేకాదు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిని దూరం చేసేందుకుగాను ,ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది సర్కార్.అంతేకాదు ప్రభుత్వం భూములను రిజిస్ట్రేషన్ చేసినా, తప్పుడు పనులకు పాల్పడినా కాని వారిపై క్రిమినల్ కేసులు పెడతామని సర్కార్ హెచ్చరించింది.

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్టార్ల బదిలీలు

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్టార్ల బదిలీలు

మియాపూర్ భూకుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీచేసింది. రెండు రోజుల్లో 72 రిజిస్ట్రార్లను బదిలీచేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.వివిద జిల్లాల నుండి 29 మంది రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లను హైద్రాబాద్ కు బదిలీచేశారు. 43 మందిని వివిద ప్రాంతాలకు బదిలీచేశారు.

ఎవరినీ ఉపేక్షించకూడదు

ఎవరినీ ఉపేక్షించకూడదు

రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొన్నారు. మియాపూర్ భూకుంభకోణం తర్వాత సిఎం కెసిఆర్ సీరియస్ అయ్యారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , రెవిన్యూ శాఖ మంత్రి , డిప్యూటీ సిఎం మహమూద్ అలీ తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అవినీతికి దూరంగా రిజిస్ట్రేషన్ల శాఖను ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆకస్మాత్తుగా ఆయా కార్యాలయాల్లో దాడులు నిర్వహించాలని సూచించారు. అంతేకాదు సుదీర్ఘంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీచేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఎవరినీ ఉపేక్షించకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

అక్రమాలను బయటపెట్టేందుకు చర్యలు

అక్రమాలను బయటపెట్టేందుకు చర్యలు

మియాపూర్ భూకుంభకోణంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు ఇంకా చోటుచేసుకొన్నాయా అనే కోణంలో కూడ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశిస్తోంది. ఈ విషయమై ఆకస్మాత్తుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తే కుంభకోణాలు, అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తరచుగా ఈ రకమైన కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టింది.

సుదీర్ఘకాలం ఒకేచోట పనిచేసేవారిని ఇలా

సుదీర్ఘకాలం ఒకేచోట పనిచేసేవారిని ఇలా

మహమ్మద్ జహంగీర్ ను ఆలంపూర్ నుండి కూకట్ పల్లికి మార్చారు. మహహ్మద్ జహీర్ అహ్మద్ ను జహీరాబాద్ నుండి ఎల్బీ నగర్ కు, సయ్యద్ సీరాజ్ ను శేరిలింగంపల్లికి, ప్రకాశ్ ను గోల్కొండ నుండి ఎస్ఆర్ నగర్ కు బదిలీ చేశారు. ఎం.రవికాంత్ ను మక్తల్ నుండి వనస్థలిపురానికి, మహ్మద్ నిజాముద్దీన్ ను మహబూబ్ నగర్ నుండి బంజారాహిల్స్ కు బదిలీచేశారు. ఇప్పటివరకు 72 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బదిలీలు పూర్తయ్యాయి. మిగిలిన 69 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడ బదిలీలు చేపట్టాలని సర్కార్ తలపెట్టింది.

English summary
Telangana government transferred 72 sub resistors and resistors in two days. another 69 subregistors will transfers in one or two days.Kcr ordered to officers to enquiry in all registration offices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X