• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPS RS Praveen Kumar: విధుల నుంచి రిలీవ్-రాజీనామాకు ప్రభుత్వ ఆమోదం-ఆ ప్రచారాలను నమ్మవద్దని ప్రవీణ్ విజ్ఞప్తి

|

ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఆయన్ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ స్థానంలో గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఐఏఎస్‌ రొనాల్డ్ రోస్‌ను నియమించింది. ప్రస్తుతం రొనాల్డ్ రోస్ ఆర్థికశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు,రాజీనామా తర్వాత ప్రవీణ్ కుమార్ అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ఆయన మాటల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడుతారా... లేక మరేదైనా పార్టీలో చేరుతారా అన్న చర్చ జరుగుతోంది.

IPS RS Praveen Kumar :అనూహ్య నిర్ణయం-పదవికి రాజీనామా-తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం..?IPS RS Praveen Kumar :అనూహ్య నిర్ణయం-పదవికి రాజీనామా-తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం..?

పొలిటికల్ ఎంట్రీపై ప్రవీణ్ కుమార్...

పొలిటికల్ ఎంట్రీపై ప్రవీణ్ కుమార్...

పదవికి రాజీనామా చేసిన మరుసటిరోజే సుప్రీం స్వేరో ప్రవీణ్ కుమార్ జనంలోకి వెళ్లారు. సోమవారం(జులై 20) ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై తానింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి రావడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారుతుందనుకోవడం కూడా సరికాదని అభిప్రాయపడ్డారు.తన భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

IPS RS Praveen Kumar : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్ ఇదే...IPS RS Praveen Kumar : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్ ఇదే...

ఆ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి...

ఆ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి...


ఆదిలాబాద్‌కు బయలుదేరిన క్రమంలో మార్గమధ్యలో ప్రవీణ్ కుమార్ కామారెడ్డి టెక్రియాల్ బైపాస్ వద్ద కాసేపు ఆగారు. అక్కడ స్వేరోస్,ఉపాధ్యాయ,యువజన సంఘాలు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతి కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని వెల్లడించారు. తాను ఇతర పార్టీల్లో చేరుతున్నట్లు కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.ఫేక్ ప్రచారాలను,వార్తలను నమ్మవద్దని కోరారు. తన జీవితం మొత్తం మహనీయులు పూలే,అంబేడ్కర్,కాన్షీరాం బాటలో,వారి ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

పేదల సేవలోనే మిగతా జీవితం...

పేదల సేవలోనే మిగతా జీవితం...


ఐపీఎస్ అధికారి,సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సోమవారం(జులై 19) తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్వచ్చంద విరమణ కోరుతూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు మిగిలే ఉన్నప్పటికీ... మరింత స్వేచ్చగా,ఎటువంటి పరిమితులు లేకుండా పేదల కోసం పనిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 26 ఏళ్ల తన ఐపీఎస్ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రవీణ్ రాజీనామా తర్వాత ఆయన హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వచ్చేది లేనిది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. పేద ప్రజల కోసం మరింత గొప్పగా పనిచేసే కార్యాచరణను ఎంచుకుంటానని... భవిష్యత్‌లో ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

English summary
The Telangana government has accepted the resignation of IPS RS Praveen Kumar. Orders were issued relieving him of his duties. The IAS Ronald Rose has appointed the Secretary of Gurukula Schools in place of Praveen. Ronald Ross is currently the Special Secretary in the Ministry of Finance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X