వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాణ్యతలేని కిట్లు,నెగిటివ్ వచ్చినా పాజిటివ్,16 ప్రైవేట్ ల్యాబ్‌ల వల్లే ఈ పరిస్థితి:తెలంగాణ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ ల్యాబ్‌లలో చేస్తోన్న పరీక్షలతో గందరగోళం నెలకొందని, కేసులు పెరిగేందుకు దోహదం చేసిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. నిపుణుల కమిటీ నివేదిక గురించి వివరించింది. కేసులు పెరగడంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయగా.. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షల తీరు గురించి కమిటీ అధ్యయనం చేసింది. అయితే అక్కడ వారు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, అందుకే కేసుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.

 నాణ్యత లేని కిట్లు..

నాణ్యత లేని కిట్లు..

రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబ్‌లకు కూడా ఐసీఎంఆర్ జూన్ 15వ తేదీన అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు ఆర్టీ-పీసీఆర్ పద్దతులు తప్పుగా నిర్వహిస్తున్నారని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని, తక్కువ నాణ్యతగల కిట్లను ఉపయోగించడం, శాంపిల్స్ సేకరించే సమయంలో పీపీఈ కిట్లు వాడటం లేదని పేర్కొన్నారు. దీంతోపాటు కొందరికీ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చెబుతున్నారని వివరించారు. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు.

16 ల్యాబ్‌ల పరిశీలన

16 ల్యాబ్‌ల పరిశీలన

రాష్ట్రంలో 17 ప్రైవేట్ ల్యాబ్స్ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇందులో 16 ల్యాబ్‌లను తమ నిపుణుల కమిటీ పరిశీలించిందని పేర్కొన్నారు. కమిటీలో నలుగురు సీనియర్ మైక్రో బయోలజిస్ట్ ఉన్నారని తెలిపారు. సదరు ల్యాబ్‌లలో కొందరు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించే సామర్థ్యం లేదని, అందుకు వారు శిక్షణ కూడా తీసుకోలేదని కఠోర సత్యాన్ని వెల్లడించారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్, ప్రైవేట్ ల్యాబ్ పోర్టల్, ఐసీఎంఆర్ మధ్య టెస్టుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అంకెల విషయంలో గణనీయమైన తేడా ఉంది అని వివరించారు.

తక్కువగా అప్‌లోడ్

తక్కువగా అప్‌లోడ్

ఒక ప్రధాన ఆస్పత్రిలో 3940 పరీక్షలు చేస్తే.. దానికి సంబంధించి 1568 మందివి మాత్రమే పోర్టల్‌లో అప్ లోడ్ చేశారని కమిటీ గుర్తించిందని శ్రీనివాస్ చెప్పారు. అందులో 475 మందికి పాజిటివ్ సోకిందని వివరించిందని... దీంతో మిగతావారి సంఖ్య వెల్లడించకపోవడంతో తేడా కనిపిస్తోందని చెప్పారు. ప్రైవేట్ ల్యాబ్‌లలో సరైన నాణ్యత లేకపోవడంతో కొన్ని తప్పుడు రిపోర్టులు కూడా వస్తున్నాయని ఆయన చెప్పారు.

Recommended Video

Congress Pays Tribute To Galwan Valley Soldiers | Amaraveerulaku Congress Salam పేరిట మౌన దీక్ష!!
నెపం ప్రైవేట్ ల్యాబ్‌లపై..

నెపం ప్రైవేట్ ల్యాబ్‌లపై..


రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. టెస్టుల రిపోర్టులను కూడా దాస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నెపం ప్రైవేట్ ల్యాబ్‌లపై తోసివేసింది. పరీక్షల నిర్వహణలో తేడాలు, నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చూపిస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేసింది.

English summary
private laboratories for inflating the total number of positive cases in the state Director of Public Health Dr G Srinivasa Rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X