హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ రికార్డ్: ఒలింపిక్‌లో స్వర్ణం గెలిస్తే రూ.2 కోట్లు, ఎక్కడ గెలిస్తే ఎంత?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కొత్త క్రీడా విధానాన్ని తీసుకు వచ్చింది. ఒలింపిక్, ఒలింపికేతర విజేతలకు భారీగా రివార్డులు ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యుత్తమ విధానం అంటున్నారు.

క్రీడాకారులు, కోచ్‌లకు భారీగా నగదు ప్రోత్సాహకాలు పెంచుతూ నూతన క్రీడా విధానాన్ని ఆవిష్కరించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకానికి రూ.2 కోట్లు నగదు బహుమతిని ప్రకటించింది. రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ఒలింపిక్స్‌తో పాటు ప్రతిష్ఠాత్మక ఛాంపియన్‌షిప్‌లు, టోర్నీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులు, వారి కోచ్‌లకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (యువజన సర్వీసులు, క్రీడలు) వెంకటేశం సోమవారం ఆదేశాలు (జీఓ ఎంఎస్‌ నంబరు 1) జారీ చేశారు.

ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు లాంటి అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తాచాటిన రాష్ట్ర క్రీడాకారులకుతోడు వాళ్లను ఈస్థాయికి తీర్చిదిద్దిన కోచ్‌లకూ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయిస్తూ సోమవారం అధికారికంగా జీవో జారీచేసింది.

అలాగే గ్రామీణస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఖో ఖో, కబడ్డీలాంటి ఒలింపికేతర క్రీడాంశాల్లో రాణించే ఆటగాళ్లకూ ఇకనుంచి ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిస్తే రూ. 25లక్షలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని, ఈసారి ఏకంగా రూ. 2 కోట్లకు పెంచారు.

Telangana govt enhances cash awards for Intl and national sport persons

ఒలింపిక్స్‌లో రజతానికి రూ. 16 లక్షల నుంచి రూ. కోటికి, కాంస్యానికి రూ. 10 లక్షల నుంచి అరకోటి రూపాయలకు రివార్డును పెంచారు. క్రీడాకారుల ప్రోత్సాహకాలకు సంబంధించి పదిహేనేళ్ల క్రితం క్రీడాశాఖ వెలువరించిన జీవోలో సవరణలు చేస్తూ తాజా ప్రతిపాదనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి పారాలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్ క్రీడాకారులకూ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఒలింపికేతర క్రీడల్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సంబంధించిన ప్రోత్సాహకాల కోసం ఆయా క్రీడాంశాల ప్రాధాన్యాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాథికార సంస్థ (సాట్స్) ప్రభుత్వానికి ప్రతిపాదిస్తుంది.

క్రీడాకారులకు అందనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ఒలింపిక్స్: స్వర్ణం నెగ్గితే రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50లక్షలు, ప్రాతినిథ్యానికి రూ.5 లక్షలు.

పారాలింపిక్స్: స్వర్ణం నెగ్గితే రూ.5 లక్షలు, రజతానికి రూ.3 లక్షలు, కాంస్యానికి రూ.2 లక్షలు

స్పెషల్ ఒలింపిక్స్: స్వర్ణానికి రూ.3లక్షలు, రజతానికి రూ.2 లక్షలు,కాంస్యానికి రూ.లక్ష.

ప్రపంచ చాంపియన్‌షిప్: స్వర్ణానికి రూ.50 లక్షలు, రజతానికి రూ.30 లక్షలు, కాంస్యానికి రూ. 20 లక్షలు.

ఆసియా క్రీడలు: స్వర్ణానికి రూ.30 లక్షలు, రజతానికి రూ. 20 లక్షలు, కాంస్యానికి రూ.10లక్షలు, ప్రాతినిథ్యానికి రూ.2 లక్షలు.

కామన్వెల్త్ క్రీడలు: స్వర్ణానికి రూ.25లక్షలు, రజతానికి రూ.15లక్షలు, కాంస్యానికి రూ. 10 లక్షలు.

జాతీయ క్రీడలు: స్వర్ణానికి రూ.5 లక్షలు, రజతానికి రూ.3 లక్షలు, కాంస్యానికి రూ.2 లక్షలు.
దక్షిణాసియా క్రీడలు: స్వర్ణానికి రూ.3 లక్షలు, రజతానికి రూ. 2 లక్షలు, కాంస్యానికి రూ. లక్ష.

చెస్ టైటిళ్లు: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్ (ఐజీఎమ్)కు రూ.3 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎమ్)కు రూ.లక్ష, ఇంటర్నేషనల్ వుమెన్ మాస్టర్ (ఐడబ్లూఎమ్)కు రూ.లక్ష.

English summary
Telangana govt enhances cash awards for Intl and national sport persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X