వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం... నేటి నుంచి అమలులోకి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన నూత‌న రెవెన్యూ చట్టం నేటి (సెప్టెంబర్ 22) నుంచి అమలులోకి వచ్చింది. రెవెన్యూ చట్టంతో పాటు మొత్తం 12 చట్టాల అమలుకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందడం.. ఆపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వాటిని ఆమోదించడంతో అవి చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇవన్నీ అధికారికంగా అమలులోకి రానున్నాయి. వీటిలో భూ హ‌క్కులు-పాసు పుస్త‌కాలు, వీఆర్వోల ర‌ద్దు, టీఎస్ బీపాస్, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, ప్రైవేటు వ‌ర్సిటీలు, తెలం‌గాణ విపత్తు, ప్రజా‌రోగ్య పరి‌స్థితి, తెలం‌గాణ ఉద్యో‌గుల పదవీ విర‌మణ వయసు క్రమ‌బ‌ద్ధీ‌క‌రణ, తెలం‌గాణ ఫిస్కల్‌ రెస్సా‌న్స్‌‌బి‌లిటీ అండ్‌ బడ్జెట్‌ మేనే‌జ్‌‌మెంట్‌, తెలం‌గాణ న్యాయ‌స్థా‌నాల రుసుము, దావాల మదింపు సవ‌రణ, తెలం‌గాణ సివిల్‌ న్యాయ‌స్థా‌నాల సవ‌రణ చట్టాలతో పాటు జీఎస్టీ స‌వ‌ర‌ణ చ‌ట్టం ఉన్నాయి.

telangana govt gazette notification orders on new revenue act 2020

ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. భూ నిర్వహణలో సరళీకృత విధానానికి,అవినీతి రహిత సేవలకు ఈ చట్టం ఉపయోగపడుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహశీల్దార్లకు,వ్యసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లకు దఖలు పరిచింది. ఇకపై రిజిస్ట్రేషన్ తో పాటూ మ్యుటేషన్ కూడా జరుగుతుంది. ఆ వివరాలన్నీ ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు.

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. అధికారులు కేటాయించిన రోజు కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంతకుముందులా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి గంటల కొద్దీ నిరీక్షించే అవసరం ఉండదు. ప్రభుత్వ భూములు,ప్రజా ఆస్తులకు ఆటో లాక్ చేస్తారు. అంటే ఎవరైనా అధికారి వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించినా కంప్యూటర్లో ఆ ఆటో లాక్ ఓపెన్ అవదు. అలాగే వారసత్వ భూములకు ఇకపై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసే పద్దతి ఉండదు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒక అంగీకారానికి వచ్చి సంతకాలతో కూడిన దరఖాస్తును సమర్పిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు.

అలాగే ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల్లో కుటుంబ సభ్యుల వివరాలన్నీ పొందుపరుస్తారు. తద్వారా, ఒకవేళ ఆ భూ యజమాని మరణిస్తే... వారసత్వ ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తగాదా రాకుండా ఉంటుంది.

English summary
Telangana govt issued gazette notification to implement new revenue act 2020 and other 11 acts.Farmers in the Telangana are happy after abolishing VRO system in revenue department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X