• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణలో కూడా లాక్‌డౌన్: 10 రోజుల పాటు..రేపట్నుంచే: వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు

|

హైదరాబాద్: ఊహించినట్టే- తెలంగాణలో లాక్‌డౌన్ పడింది. ప్రాణాంతక కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇప్పటిదాకా రాత్రివేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తోన్నప్పటికీ.. పెద్దగా మార్పు ఉండట్లేదనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం- లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపింది. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయబోతోంది. ఈ లాక్‌డౌన్ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమౌతుంది. 10 రోజుల పాటు అమల్లో ఉంటుంది.

అనంతరం అప్పటి పరిస్థితులు, రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. పొడిగించడమా? లేక ఎత్తి వేయడమా? అనేది నిర్ణయిస్తుంది కేసీఆర్ సర్కార్. కరోనా వైరస్ స్థితిగతులపై ఆరా తీయడానికి కొద్దిసేపటి కిందటే తెలంగాణ మంత్రివర్గ సమావేశమైంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించారు. సమావేశం ఆరంభమైన 15 నిమిషాల్లోనే కేసీఆర్ లాక్‌డౌన్‌పై తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. పది రోజుల పాటు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ నుంచి అత్యవసర సర్వీసులను మినహాయించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యవసరాల దుకాణాలను తెరచి ఉంచడానికి అనుమతి ఇచ్చారు.

Telangana govt imposes a complete lockdown in the state for 10 days

సోమవారం ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 32 మంది మరణించారు. 7,754 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,02,187కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 4,36,619 మంది ఉన్నారు. 2,771 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 62,797 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిణామాలతో ఓ 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడమే మంచిదని మంత్రివర్గం అభిప్రాయపడింది. దీనికి అనుగుణంగా కేసీఆర్ తుది నిర్ణయాన్ని తీసుకున్నారు.

  Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu

  వ్యాక్సిన్ కొరతను అధిగమించడానికి గ్లోబల్ టెండర్లను పిలవాలని కూడా తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఏ మాత్రం చాలట్లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో- వ్యాక్సినేషన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున టీకా కేంద్రాల వద్ద పోటెత్తుతోండటాన్ని పరిగణనలోకి తీసుకుంది. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా లేకపోవడం వల్ల.. గ్లోబల్ టెండర్లను పిలిచి.. వ్యాక్సిన్‌ను సేకరించాలని నిర్ణయించింది. ఎంత మేర వ్యాక్సిన్ సేకరించాలి? టెండర్ల కాల పరిమితిని ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్ధారించాలనే అంశంపై మంత్రివర్గం చర్చించింది. గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధివిధానాలు, లాక్‌డౌన్ మార్గదర్శకాలు, నిబంధనలతో కూడిన పూర్తి సమాచారం త్వరలోనే వెలువడించనుంది.

  English summary
  Telangana government headed by Chief Minister K Chandra Sekha Rao, imposes a complete lockdown in the state from May 12 for 10 days, amid the surge in coronavirus cases.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X