వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా , గోదావరి నదీ బోర్దులకు తెలంగాణా లేఖ .. పరిధిపై ఇంత ఏకపక్ష నిర్ణయమా?

|
Google Oneindia TeluguNews

కృష్ణా, గోదావరి నదుల బోర్డుల పరిధికి సంబంధించిన ముసాయిదా కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డులు ఏకపక్షంగా కేంద్రానికి ఎలా పంపించారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. తమ అంగీకారం లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు రెండు బోర్డులకు లేఖ రాసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారా ? అంటూ కృష్ణా, గోదావరి బోర్డులను తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది.

కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులకు లేఖలు రాసిన తెలంగాణా

కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులకు లేఖలు రాసిన తెలంగాణా


తెలంగాణ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులకు ఈ మేరకు లేఖలు రాశారు. బచావత్ ట్రిబ్యునల్ కు సంబంధించిన వాటానే ఇంకా ఖరారు కాలేదని, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటిని కేటాయిస్తున్నారు అనేది తెలియకుండా పరిధిని ఖరారు చేసి ఏం ప్రయోజనం అంటూ లేఖ ద్వారా ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించకుండా పరిధికి సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్రానికి పంపించారని, కేంద్రానికి పంపించిన వివరాలను ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్న ..

ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్న ..

తమ అభిప్రాయం తెలుసుకోకుండానే ఏకపక్షంగా ఎలా పంపిస్తారు అంటూ ప్రశ్నించింది.

అయితే ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వాటి పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచించారు. 2014లో కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డు ఏర్పడినప్పటి నుండి వాటి పరిధి పై పలుమార్లు చర్చ జరిగింది. 2018 లో పరిధికి సంబంధించిన ముసాయిదా ఖరారు చేస్తే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అప్పటి నుండి అది పెండింగ్లో ఉంది.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎఫెక్ట్ .. పరిధి నోటిఫై చేసిన కృష్ణా , గోదావరీ బోర్డులు

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎఫెక్ట్ .. పరిధి నోటిఫై చేసిన కృష్ణా , గోదావరీ బోర్డులు


ఇక దీనిపై ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించినా, అంగీకరించక పోయినా పరిధిని నోటిఫై చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించడంతో, కృష్ణా ,గోదావరి నది యాజమాన్య బోర్డులు దీనిపై తీవ్ర కసరత్తు చేశాయి. ప్రాజెక్టులను మూడు గ్రూపులుగా విభజించి ఏ ప్రాజెక్టులను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోవాలి , ఏయే ప్రాజెక్ట్ లను మానిటరింగ్ చెయ్యాలి వంటి అనేక అంశాలపై తుది నిర్ణయం తీసుకున్నాయి.

Recommended Video

L.Ramana continue As Telangana TDP president రాజకీయాలు ఛాలెంజ్ గా ఎదుర్కొంటాం | Oneindia Telugu
ముసాయిదా కేంద్రానికి ...మా అభ్యంతరాలు పట్టవా ? తెలంగాణా అసహనం

ముసాయిదా కేంద్రానికి ...మా అభ్యంతరాలు పట్టవా ? తెలంగాణా అసహనం


ఈ మేరకు ఈ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు గా సమాచారం. ఈ నేపథ్యంలో ని బోర్డుల పరిధి ముసయిదా కేంద్రానికి తమకు తెలియకుండా ఎలా పంపుతారు , అందులో ఉన్న అంశాలేంటి ? అంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డులకు లేఖలు రాసింది. కృష్ణా ,గోదావరి నదీ జలాల బోర్డుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మొదటి నుండి తెలంగాణాకు నీటి వాటాలలో అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు . ఇటీవల జలవివాదాల పరిష్కారానికి కేంద్రం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కూడా ఈ విషయం స్పష్టం చేశారు .

English summary
The Telangana government is questioning how the limits draft Krishna and Godavari river water boards were sent to the Center by the Krishna and Godavari river water ownership boards unilaterally. The Telangana government has written to the two boards to this effect, questioning how the scope can be determined without their consent. Impatient to ignore their objections. Are decisions made so arbitrarily? The Telangana government has deposed the Krishna and Godavari boards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X