హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూసీ నదికి సర్కార్ శాంతి పూజలు - 1908నాటి నిజాం తరహాలో - 10 రోజుల్లో 101 చెరువులకు గండ్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల రోజుల తరబడి ఎడ‌తెరిపి లేకుండా భారీ వర్షాలు దంచికొడంతో మూసీ న‌దికి భయానక స్థాయిలో వ‌ర‌ద పోటెత్తడం, పరివాహక ప్రాంతాలన్నీ నీటమునగడం, ఇప్పటికీ పదుల కొద్దీ కాలనీల్లో నీరు నిలిచిపోవడం తెలిసిందే. వందేళ్ల తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ ఓ వైపు బాధితుల్ని ఆదుకుంటూనే, మరోవైపు నదీమతల్లిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది. వరద విలయం ప్రభావం తాలూకు లెక్కలు మెల్లగా వెల్లడవుతున్నాయి..

జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామజస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామ

మూసీకి శాంతి పూజలు..

మూసీకి శాంతి పూజలు..

దశాబ్దాల తర్వాత ఉగ్రరూపందాల్చిన మూసీ నదికి తెలంగాణ ప్రభుత్వం శాంతి పూజలు నిర్వహించింది. వ‌ర‌ద‌ల నుంచి హైద‌రాబాద్‌ను గ‌ట్టెక్కించాలంటూ.. పురానాపూల్ కమాన్ వ‌ద్ద‌ మూసీ న‌దికి బుధ‌వారం హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ శాంతి పూజ‌ చేశారు. గంగ‌మ్మ త‌ల్లికి బోనం, ప‌ట్టువ‌స్త్రాలు పసుపు, కుంకుమ, పూలు స‌మ‌ర్పించారు. సమీపంలోని ద‌ర్గాలో సైతం మ‌హ‌ముద్ అలీ చాద‌ర్ స‌మ‌ర్పించారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్‌తో పాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. కాగా,

 1908లో నిజాం కూడా

1908లో నిజాం కూడా

400ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో 1908నాటి వరదలు విలయం సృష్టించడం, నాడు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, లక్షన్నర మంది నిరాశ్రయులు కావడం తెలిసిందే. 1908 వరదల సమయంలో నాటి నిజాం మీర్ మ‌హ‌బూబ్ అలీఖాన్.. పండితుల సూచనలు మేరకు మూసి కి శాంతి పూజలు చేసి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఆ తర్వాతగానీ మూసీ నది శాంతించిందని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చినందున అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ సర్కారు గంగమ్మకు శాంతి పూజ చేసింది.

 ముమ్మరంగా సహాయక చర్యలు

ముమ్మరంగా సహాయక చర్యలు

హైదరాబాద్ నగరంలో వరద సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. గ్రేటర్‌ అధికారులు, సిబ్బంది బృందాలు ఆయా కాలనీల్లో వ్యర్థాలను తొలగించే పనులనువేగవంతం చేశాయి. మొత్తం 190 ప్రాంతాల్లో బురద, చెత్త పేరుకుపోయినట్లు గుర్తించామని, ఇప్పటికే దాదాపు 70 ప్రాంతాలను శుభ్రం చేశామని అధికారులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో తెలంగాణలో వర్షపాతం తగ్గనుందని, గురువారం నాటికి వానలు ఇంకా తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

 10 రోజుల్లో 101 చెరువుల ధ్వంసం

10 రోజుల్లో 101 చెరువుల ధ్వంసం

గత మంగళవారం నుంచి నిన్న సోమవారం దాకా హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురవగా, భయానక రీతిలో వరద పోటెత్తింది. 10 రోజుల వ్యవధిలో వరద ధాటికి హైదరాబాద్ లోని మూడు ప్రధాన చెరువులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 101 చెరువులకు గండ్లు పడినట్లు అధికారులు తెలిపారు. వీటిలో కొన్నింటికి అధికారులే గండి కొట్టగా, మరికొన్ని వాటంతట అవే తెగిపోయాయి. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన చెరువులకు గండ్లు పూడ్చే పనిని చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

జగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామజగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామ

English summary
amid The Musi river in Hyderabad received record floods, Telangana Govt on wednesday Perform Shanti Pooja. Back in 1908, the sixth Nizam of Hyderabad, Mir Mahboob Ali offered Shanti Puja to Musi River. Heavy rains breach 101 tanks across Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X