హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రెండో డోసు వ్యాక్సిన్‌కు సడన్ బ్రేక్: నిలిపివేసిన కేసీఆర్ సర్కార్: మళ్లీ ఎప్పటికో?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక కరోని వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెలంగాణలో బ్రేక్ పడింది. వ్యాక్సిన్ కొరత వల్ల రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని నిలిపివేసినట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇదివరకే తొలి డోసును తీసుకున్న 45 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఇప్పట్లో రెండో విడత వ్యాక్సిన్ అందే పరిస్థితి కనిపించట్లేదు. వ్యాక్సిన్ కొరత వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ సర్కులర్‌ను జారీ చేసింది.

Bill Gates చీకటి కోణం: మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో సెక్సువల్ రిలేషన్: విడాకుల తరువాత వెలుగులోకిBill Gates చీకటి కోణం: మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో సెక్సువల్ రిలేషన్: విడాకుల తరువాత వెలుగులోకి

వ్యాక్సిన్ల కొర‌త అన్ని రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత వ్యాక్సిన్ డోసులు ఇవ్వడాన్ని నిలిపివేసింది. రెండోడోసు పూర్తయిన వారికే తొలి విడత వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది. మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా చేపట్టనే లేదు. వ్యాక్సిన్ కొరతతో 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వయస్సున్న వారికి టీకాను ఇవ్వడానికి ఉద్దేశించిన మూడో విడత కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరంభమే కాలేదు.

Bill Gates చీకటి కోణం: మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో సెక్సువల్ రిలేషన్: విడాకుల తరువాత వెలుగులోకి Read more at: https://telugu.oneindia.com/news/international/bill-gates-prior-romantic-relationship-with-a-female-microsoft-employee-293587.html

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేష‌న్ నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ మేరకు ఓ సర్కులర్ విడుదల చేసింది. 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ నిలిపేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా అందకపోవడం వల్లే రెండో డోసు వ్యాక్సిన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. కేంద్ర నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేద‌ని పేర్కొంది. మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందిపై ప్రభావం పడుతుంది. 45 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారు ఇప్పటిదాకా 45 లక్షల మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వారంతా రెండో డోసు టీకా కోసం ఎదురు చూస్తున్నారు. తాజా నిర్ణయంతో వారంతా ఇంకొంత కాలం రెండో డోసు వ్యాక్సిన్ కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

English summary
The Telangana government on Sunday announced the suspension of its statewide Covid-19 vaccine drive for those above 45 years of age wanting to get the second shot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X