• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్‌ పై బదిలీ వేటు: బీజేపీ ఎంపీతో ఫోన్ వ్యవహారం:మంత్రితో విభేదాల ఎఫెక్ట్..!

|

కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన కరీంనగర్ కలెక్టర్ వ్యవహారం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ సర్పరాజ్‌ అహ్మద్‌ పై బదిలీ వేటు వేసింది. కరీంనగర్ బీజేపీ ఎంపీ సంజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మంత్రి గంగులపై అనర్హత కేసు వేసేందుకు కలెక్టర్‌ సంజయ్‌కి సహకారం అందించారనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్న ఈ ఫోన్‌ సంభాషణను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.

అదే సమయంలో జిల్లా మంత్రులు ఈటెల రాజేందర్.. గంగుల కమలాకర్ లకు సైతం కలెక్టర్ కు విభేదాలు తలెత్తాయి. దీంతో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల కలెక్టర్ విషయం పైన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీయస్ఆర్టీసీలో వీఆర్‌ఎస్‌ అలజడి : కలెక్టర్ కన్నా ఎక్కువ జీతం..కానీ : ప్రభుత్వంలో విలీనం ఎఫెక్ట్..!

సర్ఫరాజ్ పైన బదిలీ వేటు..

సర్ఫరాజ్ పైన బదిలీ వేటు..

ఎట్టకేలకు కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్‌ అహ్మద్‌ పైన బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా కలెక్టర్ వ్యవహారం పైన అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కొద్ది కాలం క్రితం కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ సంజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని పైన పూర్తి సమాచారం సైతం కోరింది. మంత్రి గంగులపై అనర్హత కేసు వేసేందుకు కలెక్టర్‌ సంజయ్‌కి సహకారం అందించారనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్న ఈ ఫోన్‌ సంభాషణపైన సీఎం ఆగ్రహంతో ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగింది. దీంతో.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి పిలుపు రావడంతో కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ హైదరాబాద్‌కు వెళ్లి ఈ వ్యవహారంలో తన వాదనను వినిపించారు. జరిగిన వ్యవహారం పైన వివరణ ఇచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నివేదించినట్లుగా సమాచారం.

మంత్రులతోనూ విభేదాలు..

మంత్రులతోనూ విభేదాలు..

కలెక్టర్‌గా కరీంనగర్‌లో బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల తర్వాత నుంచి జిల్లా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌తోపాటు ..తాజాగా మంత్రి అయిన గంగుల కమకాకర్ తో పాటుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు ఆయన పరితీరుపై అసంతృప్తిగా ఉన్నా ప్రగతి భవన్‌లోని అధికారగణం అండదండలతో ఆయన ఇక్కడే కొనసాగుతూ వస్తున్నారు. 2016 అక్టోబరు 11 నుంచి ఇప్పటి వరకు ఆయన కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎవరు ఎన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా అధిష్ఠానం దృష్టికి తీసుకవెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి అందుకు భిన్నంగా మారింది . జిల్లాలోని అధికార పార్టీ నేతలు కలెక్టర్ అంశం పైన ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్లుగా చెబుతున్నారు. అయితే, తాము ఎన్నిసార్లు హెచ్చరించినా కలెక్టర్ తీరులో మాత్రం మార్పు రావటం లేదని వారు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారపార్టీ అగ్రనేతలు ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తున్నది. దీంతో..ఆయన పైన బదిలీ వేటు తప్పలేదు.

కొత్త కలెక్టర్ గా శశాంక..!

కొత్త కలెక్టర్ గా శశాంక..!

జిల్లాలోని చాలా మంది టీఆర్‌ఎస్‌ నేతలతో కలెక్టర్‌కు విభేదాలున్నాయి. రసమయి బాలకిషన్‌తోనూ కలెక్టర్‌ సర్ఫరాజ్‌‌కు వాగ్వాదం జరిగింది. మునిసిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కలెక్టర్‌ బదిలీ కావడం విశేషం. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మూడేళ్లు దాటిపోయినందునే బదిలీ చేశామంటున్నాయి. కరీంనగర్‌ కొత్త కలెక్టర్‌గా శశాంకను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జిల్లా కలెక్టర్ బదిలీ పైన జిల్లాకు చెందిన బీజేపీ..టీఆర్ యస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana govt transferred Karimnager collector Sufaraj Ahmed.collector phone discussion with BJP Mp became hot in Karimnager TRS politics. After the district ministers demand govt taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more