వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెదర్ అప్ డేట్ : రానున్న రెండు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. దక్షిణ జిల్లాల్లో ఓ మాదిరిగా వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. సోమవారం రోజున పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గతవారం నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండగా పెద్దగా వర్షాలు కురవలేదని.. ప్రస్తుతం అవి సాధారణ స్థితికి చేరుకున్నాయని అందుకే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా అధికారులు తెలిపారు.

ఉత్తర ఒడిషా ప్రాంతం నుంచి వస్తున్న గాలితుఫాను ప్రభావం తెలంగాణపై పడిందన్న అధికారులు రుతుపవనాలు బలపడటంలో సహకరించాయని చెబుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడటంతో రానున్న 24 గంటల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Telangana to have heavy rains in the next two days

ఇదిలా ఉంటే సోమవారం రోజున కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురిశాయి. అయితే కాస్త విరామం ఇచ్చి వానలు పడ్డాయి. ఎప్పుడూ తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకు అనుకున్నంత స్థాయిలో వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట్ జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదైందని వారు చెప్పారు. రానున్న రెండు రోజుల్లో కురిసే భారీ వర్షాలకు రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో వర్షపాతం సాధారణ స్థాయికన్నా 6శాతం ఎక్కువే ఉందని ఇది శుభపరిణామమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Recommended Video

కేరళలో 26 ఏళ్ల తర్వాత ఈ గేట్లు ఎత్తారు

English summary
The Telangana state is under the grip of a heavy rainfall warning for the next two days starting Tuesday. Heavy to very heavy rainfall is likely to occur in the northern districts of Telangana, while the southern districts are likely to receive a moderate spell. Widespread rainfall was recorded on Monday across various districts in the state. The South west monsoon currents that were weak in the last week have become normal over the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X