హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవైటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇది ఓ రకంగా ఆర్టీసీ జేఏసీకి షాకేనని చెప్పవచ్చు. 5100 రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది.

కీలక ప్రకటన చేసే అవకాశం

కీలక ప్రకటన చేసే అవకాశం

ఈ క్రమంలో రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు గట్టిగా వినిపించారు. ప్రభుత్వానికి సానుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ల ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంటో..

సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంటో..

హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారానేది ఉత్కంఠగా మారేది. దాదాపు గత 50 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత గురువారం సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. అయితే, మళ్లీ శుక్రవారం సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని చెప్పడం గమానర్హం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

జోక్యం చేసుకోలేమని హైకోర్టు..

జోక్యం చేసుకోలేమని హైకోర్టు..

ఆర్టీసీ ప్రైవేటీకరణపై సుదీర్ఘ వాదోపవాదలు జరిగాయని న్యాయవాది ఒకరు తెలిపారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్షన్ 102 ప్రకారం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉందని.. మంత్రివర్గానికి విస్తృత అవకాశాలున్నాయి.. కోర్టులు జోక్యం చేసుకోజాలవని పేర్కొంది. ఈ మేరకు అడ్వోకేట్ జనరల్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించిందన్నారు. పబ్లిక్ లిటిగేషన్స్ కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోలేమని చెప్పిందని తెలిపారు.

English summary
Telangana High Court green Signal to privatise 5,100 RTC routes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X