హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు హైకోర్టు షాక్... సచివాలయం కూల్చివేత ఆపాలని ఆదేశం...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు ప్రభుత్వానికి షాకిచ్చింది. సోమవారం(జూలై 13) వరకు కూల్చివేత పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సచివాలయం కూల్చివేతపై విమర్శలు..

సచివాలయం కూల్చివేతపై విమర్శలు..

హైదరాబాద్‌లోని సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే.నిజానికి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సచివాలయ కూల్చివేత తీవ్ర విమర్శలను కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ భవనాన్ని కరోనా రోగుల కోసం కేటాయిస్తే వేలాది మందికి చికిత్స అందేదని చాలామంది అభిప్రాయపడ్డారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెబుతూనే... కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకోవడమేంటని అటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నవేళ... ఆ ఇష్యూని డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేయిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ఎట్టకేలకు కేసీఆర్ నుంచి ఓ అధికారిక ప్రకటన...

ఎట్టకేలకు కేసీఆర్ నుంచి ఓ అధికారిక ప్రకటన...


సచివాలయ భవనాల కూల్చివేత కూల్చివేత సమయంలో అక్కడున్న ఆలయం,మసీదులు స్వల్పంగా ధ్వంసం కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. భవనాలు కూల్చే క్రమంలో వాటి శిథిలాలు ప్రార్థనా మందిరాలపై పడి కొంత నష్టం జరిగిందన్నారు. ఇది కాకతాళీయంగా జరిగిందని,సహృదయంతో అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. అంతేకాదు,ఎన్ని కోట్లయినా సరే ప్రభుత్వమే భరించి కొత్త సచివాలయ సముదాయంతో పాటు ఆలయ,మసీదులను నిర్మిస్తుందన్నారు. త్వరలోనే దేవాలయ,మసీదు నిర్వాహకులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని,ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కరోనా గురించి ఆందోళన చెందుతున్నవేళ..

కరోనా గురించి ఆందోళన చెందుతున్నవేళ..

గత రెండు వారాలుగా కేసీఆర్ కనిపించట్లేదు,వినిపించట్లేదు అని సర్వత్రా విమర్శలు వస్తున్న వెల్లువెత్తుతున్న వేళ... ఎట్టకేలకు ఆయన నుంచి ఓ అధికారిక ప్రకటన రావడం గమనార్హం. అయితే ప్రజలంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్న కరోనా గురించి కాకుండా... సచివాలయంలోని ఆలయం,మసీదులపై ఆయన స్పందించడం గమనార్హం. అలాగే కేసీఆర్‌ జగిత్యాలకు చెందిన ఓ రైతుతో మాట్లాడిన ఆడియో కూడా లీకైంది. కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో... కావాలనే ఈ ఆడియో లీక్ చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.

English summary
In a major development,Telangana highcourt issued orders to stop the demolition of secretariat in Hyderabad till Monday.Court asked government to submit the counter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X