కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus: వైద్యానికి అడ్డొచ్చిన మతం, డాక్టర్ చూడరు, ఆడియో క్లిప్‌పై హెచ్ఆర్సీ రియాక్షన్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి విసృతంగా వ్యాపించడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చికిత్స చేస్తున్నా.. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి.. మతం పేరు చెప్పి చికిత్స ఇవ్వబోమని చెప్పింది. దీనిపై సదరు మహిళ ఫోన్‌లోనే ఉతికి ఆరేసింది. ఆ ఆడియో క్లిప్ కూడా వైరలైంది. విషయం మానవ హక్కుల సంఘానికి చేరడంతో.. కమిషన్ సీరియస్‌గా స్పందిందించి.

మిమ్మల్ని చూడరు...

మిమ్మల్ని చూడరు...


కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ ఆస్పత్రికి ఫోన్ చేశారు. డాక్టర్ అందుబాటులో ఉంటారా..? ఎప్పుడు రమ్మంటారు అని అడిగితే... రిసెప్షనిస్ట్ నుంచి ఖంగుతినే సమాధానం వచ్చింది. ఆ మతానికి చెందిన వారికి చూడటం లేదు అని.. ఫోన్ చేస్తే మందులు వేసుకోవాలో చెబుతారని చెప్పాడు. అదేంటి ఇన్నాళ్లు తమను చూసి.. ఇప్పుడు ఇలా అంటారేంటి అని చెడామడా వాయించింది. ఓ వర్గానికి చెందినవారిని మాత్రమే చూస్తానని బోర్డు పెట్టుకోవాలని కూడా సజెస్ట్ చేసింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఇలా అని చెప్పబోతే.. మహిళ దుమ్ముదులిపింది. ఆ ఫోన్ ఆడియో రికార్డ్ కూడా చేసింది.

 హెచ్ఆర్సీకి ఫిర్యాదు

హెచ్ఆర్సీకి ఫిర్యాదు

మహిళ.. మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీనిని విదేశాల్లో ఉండే స్నేహితుల నుంచి సామాజిక కార్యకర్త, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సయ్యద్ ఇమామ్ షౌకత్ అలీ పొందారు. వెంటనే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఆడియో క్లిప్‌తోపాటు ట్వీట్ చేశారు. దీనిపై మావన హక్కుల సంఘం వెంటనే స్పందించింది. సంబంధించిన ఘటనపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, కరీనంగర్ జిల్లా కలెక్టర్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీచేశారు.

Recommended Video

Fake News Buster : 03 | సెల్ టవర్స్ నుంచి కరోనా వస్తుందా ? | Oneindia Telugu
చర్యలు తప్పవు...?

చర్యలు తప్పవు...?

మహిళకు వైద్యం అందించలేదనే అంశంపై కరీంనగర్ కలెక్టర్‌ శశాంకను వివరణ కోరగా.. ఆడియో క్లిప్ అంశం తన దృష్టికి రాలేదని చెప్పారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని.. ఆస్పత్రి సిబ్బంది తప్పుగా మాట్లాడారని తెలిస్తే.. చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

English summary
Telangana State Human Rights Commission issued a notice to the government and sought an urgent report looking into a petition alleging denial of medical treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X