• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణాకు నాల్గవ స్థానం : ఆర్‌బిఐ నివేదిక వారికి తెలిసేలా.. కేటీఆర్ ఎటాక్ !!

|

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న టాప్ ఫైవ్ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి జాబితాలో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020 - 21 పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ద్వారా పేర్కొంది. ఇక ఈ జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

దేశ ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా ఉన్న నాలుగవ రాష్ట్రం తెలంగాణా : ఆర్బీఐ నివేదిక
తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలవుతోంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడి పోయిందని, పేదరికంతో బాధపడుతున్న ప్రాంతం అన్న భావన ఉండేది. ఇక అలాంటి పరిస్థితుల నుండి తెలంగాణ ఎదిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా ఉన్న నాలుగవ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించడం దేశ ఆర్థిక రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన ప్రగతికి నిదర్శనమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో అభివృద్ధి జరగలేదన్న వారికి ఆర్బీఐ నివేదిక సమాధానం చెప్పిందని వెల్లడించింది.

Telangana in fourth place in national economy contribution : RBI report ; KTR tweet

రాష్ట్ర తలసరి ఆదాయం ఆరేళ్లలో రెట్టింపు
రాష్ట్ర తలసరి ఆదాయం గత ఆరేళ్లలో రెట్టింపు అయిందని, ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో తలసరి ఆదాయం కూడా పెరిగిందని వెల్లడించింది. దేశానికి తెలంగాణ ప్రస్తుత ధరల ప్రకారం నికర రాష్ట్ర విలువ జోడించిన (NSVA) 2014-15లో రాష్ట్ర అవతరణ సమయంలో రూ. 4,16,930 కోట్ల నుంచి 2020-21లో రెండు రెట్లు పెరిగి 8,10,503 కోట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. కేవలం ఏడేళ్ల స్వల్ప వ్యవధిలో సాధించిన ప్రగతి ప్రశంసనీయం అని ఆర్బీఐ పేర్కొంది.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

దేశ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పాటులో కీలకంగా తెలంగాణా
తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉంది. అలాగే దేశంలో జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే విషయంలో ఇది నాల్గవ స్థానంలో ఉంది. వ్యవసాయం, అటవీ మరియు ఫిషింగ్, తయారీ, మైనింగ్ మరియు క్వారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, రవాణా, కమ్యూనికేషన్ మరియు బ్రాడ్‌కాస్టింగ్, హోటళ్లు మరియు రెస్టారెంట్‌లకు సంబంధించిన ఇతర అనేక రంగాలలో తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారాన్ని అందిస్తోంది.

ఆర్బీఐ వెల్లడించిన నివేదికతో తెలంగాణ సాధించిన ప్రగతి పై మంత్రి కేటీఆర్ హర్షం
తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది. రాష్ట్ర పనితీరు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. ఎన్ఎస్వీఏ విషయంలో తమిళనాడు, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ మాత్రమే తెలంగాణ కంటే ముందున్నాయి. ఇక ఆర్బీఐ వెల్లడించిన నివేదికతో తెలంగాణ సాధించిన ప్రగతి పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ సత్తా చాటు దూసుకుపోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు .

బీజేపీ, కాంగ్రెస్ లకు తెలిసేలా షేర్ చెయ్యాలన్న కేటీఆర్
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి అది ఇచ్చాం .. ఇది ఇచ్చామని హిందీలో అర్థం పర్థం లేని స్టేట్మెంట్లు ఇచ్చే అజ్ఞానులకు ఇది చూపించాలని, వాళ్లకు తెలిసేలాగా తెలంగాణ ప్రజలందరూ షేర్ చేయాలని రాజకీయ ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. దేశానికి తెలంగాణ ప్రజలు ఎంతో చేస్తున్నారని, ఎన్నో ఇస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ఆర్బీఐ నివేదికతో అదిరిపోయే పంచ్ ఇచ్చారు.

English summary
Telangana ranks fourth among the top five states that sustain the country's economy. According to a report released by the Reserve Bank of India in the Handbook of Statistics on the Indian Economy 2020-21, Telangana ranks fourth in the list of partners in the Indian economy. KTR expressed his happiness over this and satires on bjp and congress indirectly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X