వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ ఐపాస్‌కు ప్రశంస: ఐటి, వాణిజ్య రంగాల్లో ఒంటారియోతో ఒప్పందాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటి, వ్యాపార, వాణిజ్య, ఆర్థికరంగాలలో పరస్పర సహకారంపై తెలంగాణ ప్రభుత్వం-కెనడా ఒంటారియో ప్రొవిన్స్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. వాణిజ్య-వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో పరస్పర అవగాహన-సహకారం, పరిశ్రమల ఏర్పాటు, ట్రేడ్ మిషన్ పర్యటన, ఇతర ప్రాధాన్య రంగాలలో పెట్టుబడులు, ఉపాధి వంటి అంశాల్లో ఇరు పక్షాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

హైదరాబాద్ గ్రాండ్ కాకతీయలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు, భారీ పరిశ్రమలు, జౌళి, చక్కెరశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఒంటారియో మిషన్ టు ఇండియా ప్రీమియర్ కత్లిన్‌విన్నే సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఒంటారియో ప్రావిన్స్ డిప్యూటీ మంత్రి హెలెన్ అంగస్‌లు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒంటారియో రాష్ట్రంతో ఆర్థిక,వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమమైన నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నదని, స్టార్టప్‌ల కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు.

ఒంటారియో ప్రీమియర్ క్యాథలిక్‌విన్నే మాట్లాడుతూ.. భారత్-కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. అనాదిగా రెండు దేశాల ప్రజల మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయని, తమ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన వారు సుమారు 7లక్షల మంది ఉన్నారని తెలిపారు.

హైదరాబాద్ నగరం మంచి వాతావరణంతో పాటు వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలకు అనువైన కేంద్రంగా ఆమె అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్ ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

ఐటి, వ్యాపార, వాణిజ్య, ఆర్థికరంగాలలో పరస్పర సహకారంపై తెలంగాణ ప్రభుత్వం-కెనడా ఒంటారియో ప్రొవిన్స్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

వాణిజ్య-వ్యాపార కార్యకలాపాల నిర్వహణలో పరస్పర అవగాహన-సహకారం, పరిశ్రమల ఏర్పాటు, ట్రేడ్ మిషన్ పర్యటన, ఇతర ప్రాధాన్య రంగాలలో పెట్టుబడులు, ఉపాధి వంటి అంశాల్లో ఇరు పక్షాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

హైదరాబాద్ గ్రాండ్ కాకతీయలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు, భారీ పరిశ్రమలు, జౌళి, చక్కెరశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఒంటారియో మిషన్ టు ఇండియా ప్రీమియర్ కత్లిన్‌విన్నే సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఒంటారియో ప్రావిన్స్ డిప్యూటీ మంత్రి హెలెన్ అంగస్‌లు సంతకాలు చేశారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒంటారియో రాష్ట్రంతో ఆర్థిక,వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమమైన నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నదని, స్టార్టప్‌ల కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

ప్రభుత్వం ఏర్పాటైన 18నెలల్లోనే గూగుల్, అమెజాన్, ఉబేర్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ క్యాంపస్‌లను తెలంగాణలో ఏర్పాటు చేసేలా అనువైన వాతావరణం కల్పించామన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి ఎన్నో సంస్థలకు హైదరాబాద్ నెలవుగా ఉందని వివరించారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియో ప్రీమియర్ క్యాథలిక్‌విన్నే మాట్లాడుతూ.. భారత్-కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. అనాదిగా రెండు దేశాల ప్రజల మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయని, తమ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన వారు సుమారు 7లక్షల మంది ఉన్నారని తెలిపారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

ఇరుదేశాల మధ్య వాణిజ్య,వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, కాలుష్య నియంత్రణపై సంయుక్తంగా పోరాటం జరపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

తమ రాష్ట్రంలో క్లీన్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, విద్య, ఐటీసీ, ఫిల్మ్, టెలివిజన్ రంగాలలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు. ఒంటారియో అసోసియేట్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ దీపికాదామెర్ల మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోనే జన్మించానని, ఒప్పందాల కోసం జన్మస్థలానికే రావటం ఆనందంగా ఉందని అన్నారు.

ఒంటారియోతో ఒప్పందాలు

ఒంటారియోతో ఒప్పందాలు

భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఒంటారియో ప్రీమియర్ క్యాథలిక్‌విన్నే సమక్షంలో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ఉన్నత విద్యారంగంతో పాటు అణువిద్యుత్, అగ్రిఫుడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర ఏడు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు జరిగాయి. డేటావిండ్ కంపెనీకి ఐటీ శాఖకు మధ్య సెల్‌ఫోన్‌ల తయారీ,మొబైల్ టాబ్‌లెట్‌ల తయారీకి సంబంధించి ఒప్పందం కుదిరింది.

English summary
Ontario Province, Canada and Telangana today inked a slew of MoUs in the areas of education, infrastructure, IT and research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X