వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా గుండెల్లో తెలంగాణ ఉంది : జనసేన అధినేత పవన్ కల్యాణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ అంటే తనకు మక్కువ ఎక్కువ అని మరోసారి స్పష్టంచేశారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్. ఇష్టంతోనే తెలంగాణ గురించి తాను మాట్లాడాతనని పేర్కొన్నారు. రాజకీయాల గురించి ప్రస్తావించబోనని స్పష్టంచేశారు. రాజకీయ, సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి రాసిన మన సినిమాలు పుస్తకాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఫిల్మ్‌ చాంబర్‌లో ఆవిష్కరించారు.

తెలంగాణ తన రక్తం, గుండెల్లో ఉందని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం అంటే తనకు ప్రత్యేక అభిమానమని తెలిపారు. తనకు ఈ ప్రాంతంతో అవినాభవ సంబంధం ఏర్పడిందన్నారు. తెలుగు సినిమాల ఖ్యాతి పెరుగుతుందన్నారు వపన్. మహానటి సినిమాలు చాలామందికి ప్రేరణ కలిగించాయని గుర్తుచేశారు. ఇంకా అలాంటి సినిమాలు చాలా రావాలని కోరుకున్నారు. ప్రపంచాన్ని శాసించే సినిమాలు తెలుగు నుంచి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ, రావి కొండలరావు, సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు.

telangana is my heart : pawan kalyan

రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తెలిసిందే. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీ .. గత ఎన్నికల్లో పోటీచేసిన కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకుంది. పవన్ కల్యాణ్ సహా హేహహేమీలు నాదెండ్ల మనోమర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులంతా ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాము ఓడిపోయిన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని పవన్ కల్యాణ్ ఇదివరకు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

English summary
Telangana means that he is very passionate once again, Janasena chief and senior actor Pawan Kalyan. He willingly spoke about Telangana. He made it clear that he would not mention politics. Political and Social Analyst Telakapalli Ravi's book on our films has been unveiled at the Janasenani Pawan Kalyan Hyderabad Film Chamber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X