• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ ‘రాజు’! కోట్లు దోచినా ఈడీ రాదు, బీజేపీ రిమోట్ సర్కారు: కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ కొత్త రాష్ట్రం అంత సులువుగా ఏర్పడలేదని అన్నారు

తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసం రాలేదు: రాహుల్ గాంధీ

తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసం రాలేదు: రాహుల్ గాంధీ

తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసం రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లయిందని, ప్రత్యేక రాష్ట్రంతో ఒకే ఒక కుటుంబం మాత్రమే లాభపడిందని కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగిందని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఎంతోమంది త్యాగంతో ఏర్పడిందన్నారు. యువకుల కలతో తెలంగాణ సాకారమైందన్నారు. ఎంతోమంది తల్లులు తమ కన్నీటిని ధారపోశారన్నారు.

తెలంగాణకు రాజు మాత్రమే ఉన్నాడు: కేసీఆర్ లక్ష్యంగా రాహుల్ విమర్శలు

తెలంగాణకు రాజు మాత్రమే ఉన్నాడు: కేసీఆర్ లక్ష్యంగా రాహుల్ విమర్శలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. రాష్ట్రం ఇచ్చామని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా, కార్మిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించాం కానీ.. అలా జరగలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేరని.. రాజు మాత్రమే ఉన్నారంటూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సీఎం ప్రజల సమస్యలు పరిష్కారిస్తారని.. రాజుకు ప్రజల సమస్యలు పట్టవని అన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన రెండు హామీలు రైతుల రుణమాఫీ, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి గ్యారంటీ: రాహుల్

రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి గ్యారంటీ: రాహుల్

తెలంగాణ ప్రభుత్వం రైతుల మాట వినదని. కేవలం కార్పొరేట్ల కోసం పనిచేస్తోందని రాహుల్ అన్నారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దని, అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రాహుల్. తాము చెబుతున్నది ఉత్తుత్తి మాటలు కావని, రైతుల కోసం కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీ అని అన్నారు. తెలంగాణ కల నెరవేర్చడంలో రైతు రుణమాఫీ తొలి అడుగు అని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు మెరుగైన జీవితాలను అందిస్తామన్నారు.

తెలంగాణను దోచుకున్న వ్యక్తితో పొత్తా? బీజేపీ రిమోట్ సర్కారు: రాహుల్

తెలంగాణను దోచుకున్న వ్యక్తితో పొత్తా? బీజేపీ రిమోట్ సర్కారు: రాహుల్

తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. తెలంగాణలో బీజేపీ రిమోట్ ప్రభుత్వం నడుస్తోందని, అందుకే ఈడీ లాంటి దర్యాప్తు ఇక్కడికి రావని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లు ఓడిస్తామన్నారు. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధమని అన్నారు. తెలంగాణకు నష్టం చేసిన, ద్రోహం చేసిన వ్యక్తిని సహించేది లేదన్నారు.

వారికే టికెట్లు అంటూ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్

వారికే టికెట్లు అంటూ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్

కాంగ్రెస్ నేతలకు కూడా రాహుల్ గాంధీ సభ వేదిక నుంచి హెచ్చరిక చేశారు. టీఆర్ఎస్, బీజేపీలతో లాలూచీపడే నేతలు తమకు వద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కేసీఆర్ తో ఒప్పందం గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎంత పెద్ద నాయకులైనా పార్టీ నుంచి బహిష్కరిస్తామని నేతలకు రాహుల్ గాంధీ హెచ్చరికలు చేశారు. ప్రజల పక్షాన ఉన్న నేతలకు మాత్రమే టికెట్లు అని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరాటమేనని అన్నారు. రైతుల పక్షా పోరాడే వాళ్లకు టికెట్లు ఇస్తామన్నారు. ఎలాంటి అవసరమున్నా తెలంగాణ కోసం సిద్ధమన్నారు.

వేల కోట్లు దోచినా ఇక్కడికి ఈడీ రాదు: కేసీఆర్, బీజేపీపై రాహుల్ విమర్శలు

వేల కోట్లు దోచినా ఇక్కడికి ఈడీ రాదు: కేసీఆర్, బీజేపీపై రాహుల్ విమర్శలు

మోడీ తెచ్చిన నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవలేమని తెలిసి.. అందుకనే టీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీతో కలవదని ఆ పార్టీకి తెలుసన్నారు. వేల కోట్లు అవినీతికి పాల్పడినా.. కేంద్రం కేసీఆర్‌పై కేసు పెట్టదని, ఈడీని పంపించదని రాహుల్ అన్నారు. రైతులకు తాము అండగా ఉంటామన్నారు. ఆదివాసీలకు 10 రిజర్వేషన్ల కోసం తమ మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని.. అందరికీ మేలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ.. తన ప్రసంగం మొత్తంలో కేసీఆర్ పేరును మాత్రం నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.

English summary
Telangana is not for one family: Rahul Gandhi targets cm KCR family in warangal public meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X