హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అద్భుతం.. నా కూతురు, కొడుకు ఇప్పుడే సినిమా చూడాలన్నారు: మంత్రి కేటీఆర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా సూర్య 24 సినిమాను చూసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హీరో సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం ఈ సినిమాని చూసిన ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

"ఇప్పుడే 24 సినిమా చూశాను. అద్భుతమైన స్క్రీన్ ప్లే, అత్యద్భుతమైన నటన. నా కూతురు, కొడుకు ఇప్పుడే 24 సినిమా చూడాలని అన్నారు" అని 24 సినిమా చూసి వచ్చిన తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, గత రాత్రి 11 గంటల సమయంలో ట్వీట్ చేశారు.

ఇక సినిమా విషయానికి వస్తే సూర్య హీరోగా మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24. కాలంలో ప్రయాణించటం అనే భావనతో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో మే 6న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

పలువురి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో సూర్య నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

English summary
Telangana it minister ktr tweet on suriya 24 movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X