హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్ దారిలో.. హైదరాబాద్‌లో వాట్సాప్ కార్యాలయం!: సీఈవోను కలిసిన కేటీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాట్సాప్ యూజర్స్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్‌ను గురువారం కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

కేటీఆర్ హైదరాబాదులో ఫేస్‌బుక్ పీపీడీ హెడ్ శివనాథ్‌తో కలిసి క్రిస్ డేనియల్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాట్సాప్, ఫేస్‌బుక్ కార్యకలాపాలపై చర్చించారు. కస్టమర్స్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి వాట్సాప్ సీఈవో సానుకూలంగా స్పందించారని ఐటీ శాఖ వర్గాలు తెలిపారు.

Telangana IT minister meets Whatsapp CEO Chris Daniels in Hyderabad

ఫేస్‌బుక్ 2010లో తన ఆసియా హబ్‌ను తొలిసారి హైదరాబాదులో ప్రారంభించింది. ఇదే ఫేస్‌బుక్ 2014లో వాట్సాప్‌ను స్వాధీనం చేసుకుంది. రెండు రోజుల క్రితం వాట్సాప్ సీఈవో కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌ను కూడా కలిశారు. క్రిస్ డేనియల్ ఇటీవల ఐదు రోజుల భారత్ పర్యటనకు వచ్చారు.

Telangana IT minister meets Whatsapp CEO Chris Daniels in Hyderabad

Recommended Video

వాట్సాప్ అధినేత క్రిస్ డేనియల్స్ తో మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ సమావేశం

English summary
Visiting WhatsApp CEO Chris Daniels on Thursday met Telangana IT minister K T Rama Rao in Hyderabad. While the purpose of his Hyderabad visit was not shared by the company, Rao's office informed that the minister had pitched the case of the city for setting up of WhatsApp's upcoming customer service operations centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X