వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్‌కు ఏమైంది? సిరిసిల్ల పర్యటనలో ఆద్యంతం తుమ్ముతూనే కనిపించిన డైనమిక్ లీడర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఆయనకు ఏమైంది. అనారోగ్యానికి గురయ్యారా? ప్రస్తుతం తెలంగాణలో నడుస్తోన్న చర్చ ఇది. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలుమార్లు తుమ్ముతూ, దగ్గుతూ కనిపించారు. ఆ సమయంలో ముఖానికి టవల్‌ను అడ్డుపెట్టుకుంటూ దర్శనం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏపీ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ గుర్రు, విభజన చట్టానికి విరుద్ధమని కామెంట్..

సిరిసిల్ల పర్యటనలో ఆద్యంతం..

సిరిసిల్ల పర్యటనలో ఆద్యంతం..

కేటీఆర్ ఆదివారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గల టెక్స్‌టైల్ పార్కులో నిర్మించిన సెంట్రల్‌ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పరిపాలనా భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ దృశ్యాలు కనిపించాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేశాయి.

టెక్స్‌టైల్ అడ్మిన్ భవనం ప్రారంభోత్సవంలో..

టెక్స్‌టైల్ అడ్మిన్ భవనం ప్రారంభోత్సవంలో..

టెక్స్‌టైల్ పార్క్ పరిపాలనా భవన సముదాయం శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సమయంలోనూ కేటీఆర్ తుమ్ముతూ కనిపించారు. పరిపాలనా భవనాన్ని పరిశీలిస్తున్న సమయంలోనూ ఆయన పరిస్థితిలో మార్పు రాలేదు. అంతకుముందు నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన ముఖానికి టవల్‌ను అడ్డుగా పెట్టుకుని తుమ్మడం, దగ్గడం కనిపించింది. ఆయా సందర్భాల్లో టెక్స్‌టైల్స్ శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆయన పక్కనే ఉన్నారు.

 14.50 కోట్ల రూపాయల వ్యయంతో..

14.50 కోట్ల రూపాయల వ్యయంతో..

సిరిసిల్ల చేతన వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇదివరకే ఓ టెక్స్‌టైల్ పార్కును నిర్మించింది. కొత్తగా అందులో ఓ పరిపాలన భవన సముదాయాన్ని అందబాటులోకి తీసుకొచ్చారు. కార్మికుల కోసం క్యాంటీన్, విశ్రాంతి గదులతో కూడిన ఈ భవన సముదాయాన్ని 14.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దీన్ని ఆదివారం కేటీఆర్ ప్రారంభించారు. టెక్స్‌టైల్ శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recommended Video

Telangana State In Huge Debt. Will Central Govt Be The Savior?
 త్వరలో అపెరల్ పార్కు కూడా..

త్వరలో అపెరల్ పార్కు కూడా..

టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ పలు వరాలను కురిపించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించడానికి అపెరల్‌ పార్కును స్థాపిస్తామని అన్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. పవర్‌లూమ్‌ పరిశ్రమకు 50 శాతం విద్యుత్‌ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు.

English summary
In a video that surfaced in social Media, Telangana IT Minister KTR is seen sneezing and coughing terribly in a public event. KTR continuously kept sneezing and was feeling very discomfortable with his health. He repeatedly kept wiping his nose with the pink cloth he had with him. This video is captured from the opening ceremony of public buildings at his own constituency, Sircilla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X