హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటిఆర్ 'డబుల్ ఎక్స్‌పర్ట్': తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఐటీ రంగానికి అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన రాష్ట్ర ఐటీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఆవిష్కరించింది.

హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో వైభవోపేతంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ఐటీ విధాన ప్రకటనతో పాటు దానికి అనుబంధంగా మరో నాలుగు పాలసీలు, స్టార్ట్ అప్‌కు చేయూతనిచ్చే ఇన్నోవేషన్ పాలసీ, ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించే రూరల్ టెక్నాలజీ పాలసీ, హార్డ్‌వేర్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్, మంత్రి కెటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

ప్రపంచ ఐటీ రంగంపై తనదైన ముద్ర వేసుకున్న తెలంగాణ రాష్ట్రం మరింతగా క్రియాశీలం అయ్యేందుకు కొత్త పాలసీని ఆవిష్కరించింది. దీని ముఖ్య ఉద్దేశ్యాలు.. ఐటీ కంపెనీల విస్తరణకు గమ్యస్థానం, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్, గేమింగ్, యానిమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి కొత్త తరహా టెక్నాలజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాలి. పౌరసేవల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్త్రృతంగా ఉపయోగిస్తూ వేగమైన, పారదర్శక సేవలను తెలంగాణ ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలి.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం. యువతకు స్థానికంగా ఉద్యోగవకాశాలు కల్పించడం, కంపెనీలకు నిర్వహణా భారం తగ్గించడం. మొబైల్ ఫోన్ల ద్వారా పౌరసేవలను అందించేందుకు ఎం-గవర్నెన్స్ విధానాన్ని చురుకుగా ప్రవేశపెట్టడం. డిజిటల్ తెలంగాణలో భాగంగా ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం. తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో వైఫై సేవలను విస్తరించడం. స్కూల్ కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడం.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ కేంద్రంగా టీ హబ్‌కు పెద్దఎత్తున ప్రశంసలు దక్కిన నేపథ్యంలో ప్రపంచ ఇన్నోవేషన్ యవనికపై తెలంగాణను ప్రముఖంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆవిష్కరణలే లక్ష్యంగా ఇన్నోవేషన్ పాలసీ-2016ను సిద్ధం చేసింది. 1000 ఐటీ ఉత్పత్తులు, 300 ఎలక్ట్రానిక్, 400 స్టార్టప్‌లు. స్టార్టప్‌లకు 2వేలకోట్ల పెట్టుబడుల సమీకరణ. టీ హబ్ రెండో దశలో 900 స్టార్టప్‌లకు మౌలిక సదుపాయాలు కల్పించడం. ద్వితీయ శ్రేణి నగరాల్లో రెండు ఇంక్యుబేటర్ కేంద్రాల ఏర్పాటు. ఇంక్యుబేటర్, స్టార్టప్‌లకు ప్రోత్సాహం. ఇది ఇన్నోవేషన్ పాలసీ.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

రూరల్ పాలసీని కూడా ప్రారంభించారు. ఐటీ రంగం విస్తరణకు పెద్దఎత్తున కృషి చేస్తున్న ప్రభుత్వం కేవలం హైదరాబాద్ నగరానికే ఐటీ రంగం పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం టెక్నాలజీని విస్తరించేందుకు రూరల్ టెక్నాలజీ సెంటర్స్-2016 పాలసీని రూపొందించింది. డాటా ప్రాసెసింగ్, డాటా ఎంట్రీ, డాటా మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్ వంటివి రూరల్ టెక్నాలజీ కేంద్రాల (ఆర్టీసీ) లక్ష్యం. దీంతో పాటు ఎలక్ట్రానిక్ పాలసీ, యానిమేషన్ పాలసీని కూడా ప్రకటించారు.

 ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

మొబైల్‌ ఫోన్లు, ఎల్‌ఈడీ దీపాలు, ఎల్‌ఈడీ టెలివిజన్ల తయారీకి కూర్పు (అసెంబ్లింగ్‌) కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో మ్యాక్స్‌-టచ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు 30,000 టీవీలు, లక్ష మొబైల్‌ ఫోన్లు, 3 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. 32-55 అంగుళాల టీవీలను తయారు చేయనుంది.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

ఎల్‌ఈడీ క్లస్టర్‌లో ఎల్‌ఈడీ దీపాలు, ఎల్‌ఈడీ విడి భాగాలు, ఎల్‌ఈడీ చిప్‌ ఫ్యాబ్రికేషన్‌, డ్రైవర్ల వంటి వాటిని తయారు చేయడానికి ఎల్‌ఈడీ మ్యానుఫ్యాక్చరర్స్‌ ఎస్‌పీవీ ముందుకు వచ్చింది. తద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు, 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే వీలుంది.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ


ఇ-సిటీలో మొబైల్‌ ఫోన్ల ఛార్జర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి యాక్సివోమ్‌ అంగీకరించింది. నెలకు 60 లక్షల ఛార్జర్లను తయారు చేయగల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ యూనిట్‌ వల్ల సుమారు 2,000 మందికి నేరుగా, 1,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

రానున్న మూడేళ్లలో రూ.200 కోట్ల పెట్టుబడులతో రోజుకు పది కోట్ల ఎల్‌ఈడీలను తయారు చేసే యూనిట్‌ను క్వాలిటీ ఫోటానిక్స్‌ నెలకొల్పనుంది. ఇది భారత్‌లోనే ప్రపంచ స్థాయి ఎల్‌ఈడీ సెమీ కండక్టర్ల ప్లాంట్‌ అవుతుంది.
యూఏఈకి చెందిన ఏరీస్‌ గ్రూప్‌ గ్లాస్‌లేని మొబైల్‌ ఫోన్లు, టాబ్లెట్లు, టెలివిజన్లను తెలంగాణ విపణిలోకి ప్రవేశపెట్టడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

 ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

ప్రపంచంలోనే తన తొలి సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌ ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా 1,500 మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బ్యాంకు అంతర్జాతీయ ఐటీ కార్యకలాపాలకు ఇది కేంద్రం అవుతుంది.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ వ్యాల్యూ ల్యాబ్స్‌ అత్యాధునిక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.1,362 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాంగణంలో 10,000 మంది నిపుణులు కూర్చుని పని చేయడానికి సదుపాయాలు ఉంటాయి.

 ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

ఫైనాన్షియల్‌ సేవలకు అవసరమైన ఐటీ సేవల కోసం కార్వీ అత్యాధునిక ప్రాంగణాన్ని నెలకొల్పనుంది. ఇందులో 5,000 మంది కూర్చుని పని చేయొచ్చు.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ


బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాల కోసం 40 వేల చదరపు అడుగుల కార్యాలయ ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో కొనుగోలు చేయడానికి టాటా ఏఐజీ ముందుకు వచ్చింది. దీని వల్ల రూ.40 కోట్ల పెట్టుబడులు, 600 మందికి ఉపాధి లభించే వీలుంది. క్యాప్‌ జెమినీ, నయా వెంచర్స్‌తో కూడా ఒప్పందాలు కుదిరాయి.

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ

ఐటీ పాలసీ సందర్భంగా 28 ఎంవోయులు కుదిరాయి. రూ.2,700 కోట్ల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ఇరవై అయిదు వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తామని, మంచి నిపుణులను తయారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

English summary
Telangana IT Policy Aims to Double Exports, Jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X