వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక పరిణామాలు బాధ కల్గిస్తున్నాయి: కోదండరామ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కన్నడనాట జరుగుతున్న రాజకీయాలు బాధకలిగిస్తున్నాయని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రోఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరామ్‌ వ్యాఖ్యానించారు

శనివారం నాడు ప్రోఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న గలీజు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో సంస్కరణలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం టీజేఎస్‌ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందన్నారు. కౌలు రైతులకు పెట్టుబడికై భూరికార్డుల్లోని అక్రమాలను నిరసిస్తూ ఈ నెలాఖరులో ఖమ్మం నుంచి సడక్‌ బంద్‌ చేపట్టనున్నట్టు కోదండరామ్‌ ప్రకటించారు.

Telangana janasamiti founder Kodandaram reacts on Karnataka politics

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్) లు యడ్యూరప్పకు సీఎం పదవిని కట్టబెట్టడాన్ని నిరసిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్ష జరగనుంది.

దేశ వ్యాప్తంగా ఈ విశ్వాస పరీక్షపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజకీయాల్లో మార్పును కోరుకొంటున్న తెలంగాణ జనసమితి ఈ తరహ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్ లో ఆ పార్టీ వ్యవస్థాపకులు కోదండరామ్ కన్నడ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

English summary
Telangana janasamiti founder professor Kodandaram responded on Karnataka politics on Saturday. He spoke to media at karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X