హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్థిక సర్వే: ఎగుమతుల్లో తెలంగాణకు 5వ స్థానం, 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ జాతీయస్థాయి ఎగుమతుల్లో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడుల తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.

ఈ అయిదు రాష్ట్రాల నుంచే 70 శాతం ఎగుమతులు ఉన్నాయని సోమవారం లోకసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే పేర్కొంది. తెలంగాణ నుంచి కమోడిటీ ఎగుమతులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.35,444 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.40,239 కోట్లు, 2017 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.19,830కోట్లు ఉన్నట్లు పేర్కొంది.

Telangana joins league of top 5 states that jointly contribute 70% to exports

ఏపీ-తెలంగాణలూ నామినేట్ చేయాలి: 'పద్మ'పై నిన్న పవన్ కళ్యాణ్ పెదవి విరుపు, నేడు గాలిఏపీ-తెలంగాణలూ నామినేట్ చేయాలి: 'పద్మ'పై నిన్న పవన్ కళ్యాణ్ పెదవి విరుపు, నేడు గాలి

మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల నుంచే అంతర్జాతీయంగా 70% ఎగుమతులు జరుగుతుండగా.. ఇందులో మహారాష్ట్ర వాటా 22.3%, గుజరాత్‌ వాటా 17.2%, కర్ణాటక వాటా 12.7%, తమిళనాడు వాటా 11.5%, తెలంగాణ వాటా 6.4% ఉంది. ఏపీ వాటా కేవలం 2.8% మాత్రమే. ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో, ఏపీ 9వ స్థానంలో ఉన్నాయి.

గత దశాబ్ది కాలంలో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 0.5 డిగ్రీల మేర తగ్గాయి,. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 0.25 నుంచి 0.75 డిగ్రీల దాకా పెరిగాయి. పదేళ్లలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షపాతం 50 మిల్లీ మీటర్ల వరకు పెరిగింది.

English summary
The country's youngest state, Telangana, has emerged among the top five states in the country when it comes to contribution to overall exports, the Economic Survey revealed on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X