హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు:'అభ్యంతరం లేదని బాబు చెప్పారు'(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును విభజించి రెండు రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన రాష్ర్టాల సీఎంలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది నెలలైనా ఇంకా హైకోర్టు విభజన జరగలేదన్నారు.

పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. కానీ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు లేక ఆచరణలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఈ విషయమై న్యాయవాదులు సుమారు 45 రోజుల పాటు సమ్మె చేసి, కోర్టు విధులను బహిష్కరించారని ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమావేశంలో తెలిపారు.

బార్ కౌన్సిల్ సైతం ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఎంపీలు కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రిని పలుమార్లు కలిసి విన్నవించారన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై తనకు అభ్యంతరం లేదని ఇదే సదస్సులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అభ్యంతరం లేదని చెప్పారని అన్నారు.

రెండు రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు విభజనపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. రాష్ర్టాల సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు లేనందు వల్ల కేంద్రం.. దాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వాలని సూచించారు.

నరేంద్రమోడీ

నరేంద్రమోడీ

ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన రాష్ర్టాల సీఎంలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది నెలలైనా ఇంకా హైకోర్టు విభజన జరగలేదన్నారు.

ఇంద్రకరణ్ రెడ్డి

ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి హైకోర్టు చీఫ్‌జస్టిస్ సైతం హైకోర్టు విభజన ప్రక్రియను చేపడతామన్నారని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అన్ని విధాల సానుకూల పరిస్థితులు నెలకొన్నా హైకోర్టు విభజన ప్రక్రియ మాత్రం ఊపందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే జూన్ రెండో తేదీ నాటికి తెలంగాణ ఏర్పాటై ఏడాది పూర్తవుతుందని ఆయన గుర్తుచేశారు.

హైకోర్టులు

హైకోర్టులు

అప్పటి వరకైనా రెండు రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటైతే యావత్ తెలంగాణ ప్రజలు సంతోషిస్తారని తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సుమారు 4.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని వసతులున్న భవనాన్ని ఎంపికచేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలియజేశారన్నారు.

మంత్రి సదానందగౌడ

మంత్రి సదానందగౌడ

తెలంగాణ ఆవిర్భవించిన జూన్ రెండో తేదీ నాటికి రెండు రాష్ర్టాలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటుచేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ హామీనిచ్చారు. సదస్సు విరామ సమయంలో కేంద్రమంత్రితో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి సమావేశమై వినతిపత్రం సమర్పించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన చిత్రపటం ముందు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్ర మంత్రి ఆశోక గజపతి రావు, కంభంపాటి రామ్మెహాన్ రావు తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన చిత్రపటం ముందు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్ర మంత్రి ఆశోక గజపతి రావు, కంభంపాటి రామ్మెహాన్ రావు తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, రామచంద్ర తేజావత్‌లు పాల్గొన్నారు. ఆయన చిత్రపటం ముందు పుష్పాంజలి ఘటించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, రామచంద్ర తేజావత్‌లు పాల్గొన్నారు. ఆయన చిత్రపటం ముందు పుష్పాంజలి ఘటించారు.

English summary
Telangana Law Minister Indrakaran Reddy in Judiciary Conference in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X