వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో పోరు బాటపట్టిన న్యాయవాదులు.. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా సోమవారం నాడు న్యాయవాదులు తలపెట్టిన ఛలో హైకోర్టు టెన్షన్ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

న్యాయధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను రీకాల్ చేయడం, ఉమ్మడి హైకోర్టు విభజన డిమాండ్స్ తో ఛలో హైకోర్టు ఆందోళనను చేపట్టారు న్యాయవాదులు. హైకోర్టు సొంత మార్గదర్శకాలను సైతం పక్కనబెట్టి చేపట్టిన న్యాయవాదుల ప్రాథమిక కేటాయింపులను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరిగే పరిస్థితి లేకపోవడం, తెలంగాణ పట్ల పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక హైకోర్టుకై పట్టబడుతున్నారు తెలంగాణ న్యాయవాదులు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

తెలంగాణ న్యాయవాదుల ఛలో హైకోర్టు పిలుపు నేపథ్యంలో.. హైకోర్టు చుట్టు పక్కలు భారీగా మోహరించిన పోలీసులు, న్యాయవాదులను అడ్డుకునేందుకు ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైకోర్టు సమీపంలో న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఏపీ న్యాయధికారులకు, జడ్జిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేస్తున్న తెలంగాణ న్యాయవాదులు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

పోలీసుల అడ్డగింపుల నడుమ విజయవంతంగా తమ ఆందోళన చేపట్టిన న్యాయవాదులు, హైకోర్టు విభజన, ప్రాథమిక న్యాయవాదుల కేటాయింపులను రీకాల్ చేయాలని కోరుతూ నినాదులు చేస్తున్న ద్రుశ్యం. అలాగే హైకోర్టు అధికారుల తీరును తప్పుబడుతూ న్యాయవాదులను కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకపోవడం పట్ల నిరసన తెలియజేశారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

ఆందోళన చేస్తున్న న్యాయవాదులను తమ వాహానాల్లోకి ఎక్కిస్తున్న పోలీసులు. 500 మంది పోలీసు పహారా నడుమ హైకోర్టులోకి చొచ్చుకుపోయేందుకు న్యాయవాదులు ప్రయత్నించడంతో, వాళ్లను అడ్డగించిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

ఏపీ న్యాయాధికారుల కుట్రలను విచ్చిన్నం చేసేందుకు చేపట్టిన ఛలో హైకోర్టును విజయవంతం చేసే క్రమంలో ఆందోళనకు దిగిన న్యాయవాదులు. కాగా, ఏపీ న్యాయాధికారుల కుట్రలపై సిటీ సివిల్ కోర్టులో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, రాష్ట్రంలో వివిధ కోర్టుల న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యం లో సమావేశమయ్యారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైకోర్టులోకి న్యాయవాదులను అనమతించకుండా నిర్ణయాలు తీసుకోవడం, హైకోర్టు విధులకు హాజరయ్యే న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తాత్కాలిక సీజే చాంబర్ ఎదుట రెండు గంటలపాటు న్యాయవాదులు బైఠాయించారు న్యాయవాదులు.గండ్ర మోహన్‌రావు, ఎం రాజేందర్‌రెడ్డి, రఘునాథ్, సరసాని సత్యంరెడ్డి, మోహన్‌లాల్ ఆధ్వర్యంలో 60 మంది న్యాయవాదులు చాంబర్ వద్ద బైఠాయించడంతో.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బోసలే ఆధ్వర్యంలోని సీనియర్ న్యాయమూర్తుల బృందం (జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్) న్యాయవాద ప్రతినిధులతో చర్చలు జరిపింది.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైకోర్టు విభజనకు సంబంధించి ఆంధ్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ దహన సంస్కారాలతో పాటు ఏపీ ప్రభుత్వానికి పిండ ప్రధానం చేశారు న్యాయవాదులు. అనంతరం సిటి సివిల్ కోర్టు నుండి ర్యాలీ చేపట్టి మదీనా క్రాస్ రోడ్డు వరకు ఆందోళన నిర్వహించారు. ఇదే క్రమంలో పోలీసులు న్యాయవాదులను అడ్డుకుని జేఏసీ కో-కన్వీనర్లు మాణిక్‌ప్రభుగౌడ్, తిరుమల్‌రావు, యాదగిరితోపాటు 120మంది న్యాయవాదులను పోలీసులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

న్యాయమూర్తుల కేటాయింపుల రీకాల్‌పై హైకోర్టు న్యాయమూర్తుల బృందం నిస్సహాయత వ్యక్తం చేయడంతో పాటు, మూడు నెలల గడువు కావాలని కోరడంతో చర్చల్లో పాల్గొన్న న్యాయవాద ప్రతినిధులు రఘునాథ్, సరసాని సత్యంరెడ్డి ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

పోలీసులు న్యాయవాదుల అరెస్టుకు యత్నిస్తుండగా, హైకోర్టు న్యాయాధికారుల తీరుపై మండిపడుతూ తమ అభ్యంతరాలను నినాదాల ద్వారా వ్యక్తం చేస్తోన్న న్యాయవాద సంఘాలు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

న్యాయవాదుల కేటాయింపుపై రీకాల్ కి ఉమ్మడి హైకోర్టు అంగీకరించకపోవడంతో విధుల బహిష్కరణను కొనసాగించాలని న్యాయవాద ప్రతినిథులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో జూన్ 14 వ తేదీన రీలే నిరహారదీక్షలు, 15వ తేదీన మౌన ప్రదర్శనలు, 16వ తేదీన వంటావార్పు, 17వ తేదీన ఆప్షన్ మార్చుకోవాలని ఏపీ న్యాయాధికారులకు పోస్టుకార్డులు ఇవ్వడం వంటి కార్యచరణతో ముందుకెళ్లాలని తీర్మానించినట్టుగా తెలుస్తోంది.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైకోర్టుకు చేరుకునే అన్ని మార్గాల్లో మోహరించిన పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా హైకోర్టుకు హాజరయ్యే న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆయా జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు పలు దఫాలుగా హైకోర్టు ప్రాంగణం వద్దకు చేరుకుని తమ నిరసన గళం వినిపించారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోను, కరీంనగర్ లోను ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు న్యాయవాదులు. వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపూర్ణానంద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించిన అక్కడి న్యాయవాదులు కోర్టు గేటుకు తాళం వేసి గంటపాటు ధర్నా చేశారు.

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

హైటెన్షన్ వాతావరణంలో 'ఛలో హైకోర్టు'.. ఆందోళన సక్సెస్ (పిక్చర్స్)

కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన న్యాయవాదులు చలో హైకోర్టులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. నెల 17 వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. చలో హైకోర్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలమూరు జిల్లా న్యాయవాదులు తరలివెళ్లారు. నల్లగొండలో న్యాయశాఖ ఉద్యోగులు న్యాయవాదులకు మద్దతుగా కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

English summary
Telangana lawyers dharna was successfully finished that opposing the highcourt officials decisions that they made against the telangana lawyers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X