హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి వెళ్లాల్సిందే?: ఆంధ్ర జడ్జీల నియామకంపై లాయర్ల నిరసన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్థృతం చేశారు. సోమవారం విధులు బహిష్కరించి నాంపల్లి కోర్టు ముందు, రంగారెడ్డి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు.

మంగళవారం నుంచి కోర్టుకు తాళాలు వేసి న్యాయమూర్తులతో సహా ఉద్యోగులు ఎవరినీ లోనికి పోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ న్యాయమూర్తుల నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు.
ఇందుకు నిరసనగా జూన్ 13న చలో హైకోర్టు తలపెట్టినట్లు న్యాయవాదులు ప్రకటించారు.

తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రతి న్యాయవాదికి ఆరోగ్య భద్రతా కార్డుతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని అన్నారు. 42మంది ఆంధ్ర న్యాయమూర్తులని తెలంగాణలో నియమించాలన్న కుట్రలను మానుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులు ఆప్షన్ విధానం ద్వారా తెలంగాణలో పని చేయడాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. ఆప్షన్ విధానాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసుకుని ఆంధ్ర న్యాయమూర్తులు అక్కడికి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

రాష్ట్రంలో న్యాయాధికారుల నియామకాలను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళన ఉద్థృతం చేశారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

సోమవారం విధులు బహిష్కరించి నాంపల్లి కోర్టు ముందు, రంగారెడ్డి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

మంగళవారం నుంచి కోర్టుకు తాళాలు వేసి న్యాయమూర్తులతో సహా ఉద్యోగులు ఎవరినీ లోనికి పోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

తెలంగాణ న్యాయమూర్తుల నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ఇందుకు నిరసనగా జూన్ 13న చలో హైకోర్టు తలపెట్టినట్లు న్యాయవాదులు ప్రకటించారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

సోమవారం విధులు బహిష్కరించి నాంపల్లి కోర్టు ముందు, రంగారెడ్డి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

మంగళవారం నుంచి కోర్టుకు తాళాలు వేసి న్యాయమూర్తులతో సహా ఉద్యోగులు ఎవరినీ లోనికి పోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

న్యాయవాదుల నిరసన

న్యాయవాదుల నిరసన

తెలంగాణ న్యాయమూర్తుల నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ఇందుకు నిరసనగా జూన్ 13న చలో హైకోర్టు తలపెట్టినట్లు న్యాయవాదులు ప్రకటించారు.

English summary
Telangana lawyers and judges on Monday protested against appointment of AP judges in Telangana State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X