• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విలక్షణ నేతకు నివాళి: ప్రజల మనిషి పాల్వాయి ప్రస్థానం, నెహ్రూ నుంచి నేటి వరకు

|

హైద‌రాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని పార్టీ నేతలు, ప్రముఖులు శనివారం సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన పాల్వాయి మృతదేహాన్ని ఢిల్లీకి తరలించారు. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు.

ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత, కారులోనే కుప్పకూలారు, కేసీఆర్ ఆదేశాలు..

అనంతరం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. శుక్రవారం రాత్రి పాల్వాయి భౌతిక కాయానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య నివాళులు అర్పించారు. శనివారం ఉదయం నుంచి వివిధ పార్టీల నేతలు పాల్వాయి భౌతిక‌కాయాన్ని కడసారి చూసేందుకు తరలివస్తున్నారు.

విలక్షణ నాయకుడు

విలక్షణ నాయకుడు

అలుపెరుగని ప్రజాసేవకుడిగా సుదీర్ఘ కాలం తన రాజకీయ ప్రజాజీవన ప్రస్థానాన్ని సాగించి గుండెపోటుతో కన్నుమూసిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా గుర్తింపు పొందారు.

నెహ్రూ కాలం నుంచి..

నెహ్రూ కాలం నుంచి..

నెహ్రూ కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇందిరాగాంధీ, రాజీవ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో సన్నిహితంగా ఉంటూ గాంధీ కుటుంబం మనిషిగా, కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతగా గుర్తింపు పొందాడు.

వెనుకడగు వేయలేదు..

వెనుకడగు వేయలేదు..

కాంగ్రెస్‌లో ఎంతోమంది రాజ్యసభ సభ్యత్వానికి పోటీ పడినా పాల్వాయికి గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం ఆయన 2012లో రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినప్పటికి పార్టీ లోటుపాట్లు, రాష్ట్ర నాయకత్వాల తప్పిదాలను ఎత్తిచూపడంలో వెనుకంజ వేయకపోవడం ఆయనకు కాంగ్రెస్‌లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆయన విమర్శలు తీవ్రమే..

ఆయన విమర్శలు తీవ్రమే..

ఇక ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలపై, వారి పాలానా విధానాలపై పాల్వాయి చేసే విమర్శలు ముప్పుతిప్పలు పెట్టేవిగా ఉండేవి. కాంగ్రెస్ సీనియర్ ఎన్‌డి.తివారితో ఉన్న అనుబంధంతో కొంతకాలం ఆయన తివారి కాంగ్రెస్‌లోనూ పనిచేశారు.

కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా..

కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా..

1994ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నిర్ణయానికి విరుద్ధంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో జి.వెంకటస్వామి, ఎంఎస్.సత్యనారాయణ, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి వంటి సీనీయర్లకు సన్నిహితుడిగా వ్యవహరించారు.

పాల్వాయి మరణంతో తొలి తరం ముగిసింది

పాల్వాయి మరణంతో తొలి తరం ముగిసింది

పాల్వాయి మరణంతో ఉమ్మడి జిల్లా తొలి తరం కాంగ్రెస్ నేతల శకం ముగిసినట్లయ్యింది. పాల్వాయి కాంగ్రెస్ రాజకీయాల్లో కె.జానారెడ్డి, ఆర్. దామోదర్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి రెండు తరాల నాయకులతో కొనసాగుతూ వచ్చారు. జిల్లా రాజకీయాల్లో గత కొంతకాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌తో విభేదించారు.

కాంగ్రెస్ విధేయుడిగా ఉన్నా..

కాంగ్రెస్ విధేయుడిగా ఉన్నా..

కాంగ్రెస్ అధిష్టానంకు విధేయుడిగా ఉండే పాల్వాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పొత్తుల్లో భాగంగా మునుగోడు అసెంబ్లీ స్థానా న్ని సిపిఐకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ తన కూతురు పాల్వాయి స్రవంతిని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించగా ఆమె టిఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు.

వైయస్ విధానాలను తప్పుబట్టారు..

వైయస్ విధానాలను తప్పుబట్టారు..

పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆది నుండి కూడా ప్రత్యేక తెలంగాణ వాదిగా గుర్తిం పు పొందారు. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో, తదుపరి చిన్నారెడ్డి, పురుషోత్తంరెడ్డిల సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ఫోరం సమయంలో కూడా పాల్వాయి చురుగ్గా వ్యవహరించారు. పార్టీ వేదికల్లో, చట్టసభల్లో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించేవారు. వైయస్సార్ ప్రభుత్వ విధానాలను సైతం ఆయన పలుమార్లు తప్పుబట్టారు.

చిరస్మరణీయం

చిరస్మరణీయం

టిఆర్‌ఎస్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉద్ధృతిని, ప్రజల అభిష్టాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీకి వివరించడంలో తీవ్రంగా కృషి చేశారు. పొలవరం ప్రాజెక్టును మొదటి నుండి వ్యతిరేకిస్తున్న పాల్వాయి మునుగోడు నియోజకవర్గం ఎదుర్కోంటున్న ఫ్లోరైడ్ సమస్య పరిష్కరానికి నక్కలగండి ఎత్తిపోతల కోసం గట్టిగా పోరాడారు. సిఎం కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్లను తప్పుబడుతూ పాల్వాయి చేసే విమర్శలు అనేక సందర్భాల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. రాష్ట్ర రాజకీయాల్లో, ఢిల్లీలో తాను ఎంత బిజీగా ఉన్నా మొదటి నుండి కూడా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పాల్వాయి పట్టుదలగా కృషి చేయడం ఆయనను ఈ ప్రాంత ప్రజల్లో చిరస్మరణీయుడిగా నిలిపింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరవు, ఫ్లోరైడ్ పీడిత నియోజకవర్గంగా ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి, చండూర్, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల అభివృద్దికి పాల్వాయి చేసిన కృషి ఆయనను ప్రజల మనిషిగా ముద్రవేసింది.

నేతల సందర్శన

నేతల సందర్శన

తెలంగాణ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎంపీ కవిత, కాంగ్రెస్ నేత జానారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

English summary
Telangana Leaders Condolence to Congress MP Palvai Govardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X